నమిత
తెలుగు, తమిళంలో సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నమిత. విజయ్, అజిత్, సూర్య, విజయకాంత్ తో పాటు తెలుగు హీరోలతోనూ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 2008లో ఆలయం నిర్మించారు. తమిళనాడులోని తిరునల్వేలిలో నమిత కోసం ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. ఖుష్బూ తర్వాత ఆలయం నిర్మించబడిన నటిగా నమిత గుర్తింపు తెచ్చుకున్నారు.
హన్సిక
సౌత్ సినీ పరిశ్రమలో చిన్న ఖుష్బూగా పేరు తెచ్చుకున్నారు హన్సిక. ఖుష్బూ కోసం ఆలయం నిర్మించిన అభిమానులు చిన్న ఖుష్బూ హన్సిక కోసం కూడా అలాంటి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. దీని కోసం మధురైలో ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరిగాయి, అయితే హన్సిక నిరాకరించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
నయనతార
సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు నయనతార. ఆమె సినిమాల్లో గ్లామర్ పాత్రలే కాకుండా అమ్మవారి పాత్రలు కూడా పోషించారు. త్వరలో ఆమె నటించిన 'ముక్కుతి అమ్మన్' చిత్రం రెండో భాగం విడుదల కానుంది. దైవత్వంతో కూడిన నయనతార కోసం కూడా అభిమానులు ఆలయం నిర్మించేందుకు ముందుకొచ్చారు. కానీ నయన్ నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.