లైంగిక వేధింపుల కేసు: చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్

First Published | Sep 20, 2024, 3:51 PM IST


లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన  జానీ మాస్టర్ కు కోర్ట్ రిమాండ్ విధించింది. పోలీసులు చంచల్ గూడ జైలు కి తరలించారు. 

మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అతని మీద పై పోక్సో(POCSO) కేసు సైతం నమోదైంది. గతంలో తన అసిస్టెంట్ గా పని చేసిన, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో జానీ మాస్టర్ పరార్ అయ్యాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడఖ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టాయి. 

Jani Master


సెప్టెంబర్ 19వ తేదీ గురువారం జానీ మాస్టర్ ని గోవాలో  సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ సిసిఎస్ లో జానీ బాషాను ఉంచారు. నార్సింగ్ ఏసీపీ రమణ అక్కడకు చేరుకున్నారు. జానీ మాస్టర్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం.  

అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడు  జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు హాజరుపరిచారు.  

Latest Videos


Jani Master

ఉప్పరపల్లి కోర్ట్ జానీ మాస్టర్ కు 14 రోజులు, అనగా అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) యాక్ట్ నమోదు చేయడంతో, ఆయన న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. 

కాగా జానీ మాస్టర్ సంచలన కామెంట్స్ చేశారు. నన్ను కుట్రపూరితంగా ఇరికించారు. దీని వెనకున్న వాళ్ళను వదలను అని జానీ మాస్టర్ మీడియాతో అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు పరిశీలీస్తే...  జానీ మాస్టర్ గతంలో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Jani Master

జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. 

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ బాలికగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు.   
 

కాగా జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

మరోవైపు అనసూయ, సమంత సదరు యువతికి తమ మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ మాదిరి.. తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు. 
 

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు రాజకీయ రంగు పులుముకుంది. జనసేనలో ఉన్నందుకే నా భర్తను కొందరు ఇరికించారని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు.నేరం రుజువయ్యే వరకు ఎవరూ నేరస్తులు కారు, అంటూ  జానీ మాస్టర్ కి మద్దతుగా నాగబాబు పరోక్షంగా ట్వీట్స్ వేయడం గమనార్హం. 

బీజేపీ నేతలు జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ లో భాగమే అంటున్నారు. అమాయకులైన హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని, మత మార్పిడులకు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

click me!