పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కంప్లీట్..అల్లు అర్జున్ హ్యాపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా సినీ లవర్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా సినీ లవర్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆగష్టు లోనే రిలీజ్ కావలసింది. వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. దీనికి తోడు అనేక రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ అభిమానులని కంగారు పెట్టాయి. 

ఏది ఏమైనా ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అప్పటికల్లా చిత్రాన్ని రెడీ చేసేందుకు సుకుమార్, అల్లు అర్జున్ అండ్ టీం తెగ కష్టపడుతున్నారు. ఇంతలో బన్నీ అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యేలా ఒక వార్త బయటకి వచ్చింది. 


పుష్ప 2 ఫస్ట్ హాఫ్ ఎలాంటి పెండింగ్ లేకుండా ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుందట. ఫస్ట్ హాఫ్ ని సుకుమార్ రన్ టైంతో సహా లాక్ చేశారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. దీనితో అల్లు అర్జున్ ఫస్ట్ హాఫ్ ప్రివ్యూ చూశారట. ఫస్ట్ హాఫ్ అవుట్ పుట్ పట్ల అల్లు అర్జున్ సూపర్ హ్యాపీగా ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. 

డిసెంబర్ 6 రిలీజ్ డేట్ కి ఎక్కువ టైం కూడా లేకపోవడంతో సుకుమార్ ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారట. పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో కొన్ని రీ షూట్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

click me!