ప్రైమ్ వీడియోలో ‘బలగం’.. ప్రతి ఒక్కరూ చూసేందుకు నాలుగు బలమైన కారణాలు..

First Published | Apr 26, 2023, 3:02 PM IST

తెలంగాణ నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బలగం’. ప్రస్తుతం ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ ప్రతి ఒక్కరూ చూసేందుకు నాలుగు బలమైన కారణాలు ఇవని చెప్పొచ్చు.
 

ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే సినీప్రియులకు ‘బలగం’ ఓ అద్భుతమైన సినిమా. కుటుంబ నేపథ్యంలో కొత్తదనాన్ని చూపించారు. థియేటర్లలో విజయం సాధించిన తరువాత, తెలుగు కుటుంబ నాటకం బలగం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఊరూరా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో మార్చి 24 నుంచి విజయంతంగా  ప్రసారం అవుతోంది. అయితే ఈసినిమాను  జనాలు అంతగా ఎందుకు ఆదరించారు. ఓటీటీలోనూ చూసేందుకు  నాలుగు బలమైన కారణాలను తెలుసుకుందాం. 
 

స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ : Balagam చిత్రంలో మొదటగా నటీనటులు సహజమైన నటనతో ప్రేక్షకుల హ్రుదయాలను కదిలించారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి పులికొండ - కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, కోట జయరామ్, మురళీధర్ గౌడ్, మైమ్ మధు వంటి ప్రతిభావంతులైన నటులు తన బెస్ట్ పెర్ఫామెన్స్ ను అందించారు. పల్లెటూరి వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిన వ్యక్తులుగా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. 
 


స్టోరీ లైన్ : తెలంగాణలోని గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన కుటుంబ పెద్ద ఆకస్మిక మరణం తర్వాత జరిగిన పరిణామాల చుట్టూ ‘బలగం’ కథ తిరుగుతుంది. ఈ ఘటన తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై, అలాగే వారి సంబంధాలపై, గ్రామస్తులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందనే కోణం ఆకట్టుకుంటోంది. అలాగే కొన్నాళ్లుగా దూరమైన ఒక కుటుంబం కలిసిపోవడానికి ఆ పెద్దయాన మరణం ఎలా కారణం అవుతుంది  అనే విషయాలను ఈ చిత్రం విశ్లేషిస్తుంది. ఈ  కథాంశం  ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా, ఆలోచింపజేసేలా, ఆకర్షణీయంగా ఉంటుంది. 
 

సంస్కృతి : ఈ ప్రాంతంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఓటీటీ వీక్షకులు అనుభవించే అవకాశాన్ని కల్పించింది.  ఈ చిత్రం తెలంగాణలోని ఒక గ్రామంలో సెట్ చేయడంతో అక్కడి  విలక్షణమైన దుస్తులు, వివిధ ఆచారాలు, జీవనవిధానాన్ని లోతుగా చూపించారు. దీంతో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులను తెలంగాణకు తీసుకొస్తుంది. 

కంటెంట్ : బలగం ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి తమ ఇళ్లలో చూసేందుకు ఇది మంచి ఎంపిక. చిత్రంలోని కథాంశం ఉద్వేగభరితంగా, ఆకర్షణీయంగా ఉంది. సంగీతం కూడా తెలంగాణ జానపద పాటల నుండి ప్రేరణ పొందడంతో అందరికీ కనెక్ట్ అయ్యింది. చిన్న పెద్ద అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ మరియు ఫెండ్లీ కంటెంట్ ను చూపించడంతో సినిమా ప్రతి ఒక్కరూ చూడదగినదిగా మారింది.

మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్రహ్మండమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రం రీసెంట్ గానే థియేటర్లలో 50 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటోంది. వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి - కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

Latest Videos

click me!