ఈ వీకెండ్ కాస్త డిఫరెంట్‌గా నవ్విస్తూనే ఉత్కంఠ రేపే సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ బ్లాక్ కామెడీ, మర్డర్ మిస్టరీ చిత్రాలపై ఓ లుక్కేయండి.
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్ కామెడీ, మర్డర్ మిస్టరీ సినిమా చూడాలనుకుంటే, జూన్ 4న విడుదలైన 'మా బెహన్' చూడొచ్చు. ఈ సినిమా సంబంధాలు, సామాజిక పరిస్థితులు, ఊహించని ఘటనలను డార్క్ కామెడీ కోణంలో చూపిస్తుంది. కామెడీతో పాటు సస్పెన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
24
టోస్టర్
పెళ్లిలో గిఫ్ట్‌గా వచ్చిన ఓ టోస్టర్‌ను తిరిగి దక్కించుకోవాలని మొండిపట్టు పట్టిన ఓ పిసినారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిన్న పంతం కాస్తా వింత సంఘటనలు, నేరాలు, హత్యలకు దారితీస్తుంది. సినిమా మొదట్లో కామెడీగా అనిపించినా, నెమ్మదిగా క్రైమ్ థ్రిల్లర్‌గా మారిపోతుంది.
34
మోనికా, ఓ మై డార్లింగ్
అద్భుతమైన మర్డర్ మిస్టరీ, బ్లాక్ కామెడీ చిత్రాల్లో 'మోనికా, ఓ మై డార్లింగ్' ఒకటి. ఓ యువ ఇంజనీర్ చుట్టూ తిరిగే ఈ కథలో ప్రమాదకరమైన కుట్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్, హుమా ఖురేషీల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
రొమాన్స్, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్‌తో నిండిన 'హసీన్ దిల్‌రుబా' సినిమాను మీరు ఇప్పటివరకు చూడకపోతే, ఈ వారం తప్పక చూడాల్సిన చిత్రమిదే. ఓ హత్య కేసు విచారణలో ఎన్నో రహస్యాలు బయటపడతాయి. తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సేల అద్భుత నటన మిమ్మల్ని చివరి వరకు సీటుకు కట్టిపడేస్తుంది.