తనకు ఎవరో జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చారంటూ కామెంట్ చేశారు.. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా.. కొందరు పండ్ల రసం ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే గుండెనొప్పి మొదలైందని చెప్పారు. ఆ తర్వాత తనని ఆసుపత్రికి తరలించారని చెప్పుకొచ్చారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆలీఖాన్ పై విషం ప్రయోగం జరిగిందని ఆరోపణలు చేశారు. రాజకీయమే కోసం విషం ప్రయోగం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.