Folk Dancer Nagadurga: హీరోయిన్‌గా ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ బిజీ.. ఇక ఫోక్ సాంగ్స్ కి గుడ్‌ బై ?

Published : Jun 22, 2026, 06:17 PM IST

స్టార్‌ ఫోక్‌ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌ గా టర్న్ తీసుకుంది. ఇప్పటికే తమిళంలో ఓ మూవీలో నటించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.  మరి ఇకపై ఫోక్‌ డాన్స్ కి గుడ్‌ బై చెప్పినట్టేనా? 

PREV
15
ఫోక్స్ డాన్సర్‌గా నాగదుర్గ పాపులర్‌

తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్‌ రంగంలో ఇప్పుడు ఫోక్‌సాంగ్స్ హవా నడుస్తోంది. జానపద పాటలకు విశేష ఆదరణ దక్కుతోంది. దీంతో ఒరిజినల్‌ సాంగ్స్ చాలా వస్తున్నాయి. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. అయితే ఫోక్‌ సాంగ్స్ లో డాన్సులు చేసే నటీమణుల్లో బాగా పాపులర్‌ అయ్యింది నాగదుర్గ. ఆమె డాన్స్ చేసిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ అని చెప్పొచ్చు. తనదైన అద్భుతమైన డాన్సులతో ఆకట్టుకుంటోంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. డాన్సులతోనే కాదు, అందంతోనూ కట్టిపడేస్తోంది నాగదుర్గ. సుమారు మూడు వందలకుపైగా పాటల్లో ఆమె డాన్సులు చేయడం విశేషం.

25
తమిళంలోకి హీరోయిన్‌గా నాగదుర్గ ఎంట్రీ

యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడంతో ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె పవీష్‌ హీరోగా రూపొందుతున్న `లవ్‌ హో లవ్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. నాగదుర్గ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రమిది. టీజర్‌, పాటలతో ఆకట్టుకుంటోంది. నాగదుర్గకిది మంచి ఎంట్రీ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

35
నాగదుర్గ టాలీవుడ్‌ ఎంట్రీ

నాగదుర్గ.. హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సుకుమార్‌ రైటింగ్స్, బన్నీవాసు వర్క్స్ పతాకాలపై రూపొందుతుంది. సుకుమార్‌, బన్నీవాసు నిర్మాతలు. ఈ మూవీ తాజాగా స్టార్ట్ అయ్యింది. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తుండగా, హీరోగా ప్రియదర్శి కావడం విశేషం. మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుందట. సుకుమార్‌ రైటింగ్స్, బన్నీవాసు ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. దీనికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీకి సంబంధించిన వివరాలను నాగదుర్గ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

45
ఫోక్‌ సాంగ్స్ కి నాగదుర్గ గుడ్‌ బై

నాగదుర్గకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్‌గా బిజీ అవుతుంది. మరి ఇకపై కూడా జానపద పాటలకు డాన్స్ లు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బిగ్‌ స్క్రీన్‌ పై అవకాశాలు వస్తే, బుల్లితెరని వదిలేస్తుంటారు. ఇమేజ్‌, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అలా చేస్తుంటారు. దర్శక, నిర్మాతలు కూడా ఈ విషయంలో పర్టిక్యూలర్‌గా ఉంటారు. మరి నాగదుర్గ ఇకపై ఫోక్ సాంగ్స్ ని వదిలేస్తుందా? లేక రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందా అనేది చూడాలి. 

55
నాగదుర్గ పాపులర్‌ సాంగ్స్

ఇక ఫోక్ డాన్సర్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నాగదుర్గకి `కాపోళ ఇంటికాడ` అనే పాట బాగా గుర్తింపు తెచ్చింది. ఇటీవల వచ్చిన `పేరుగళ్ల పెద్ది రెడ్డి` మరింత పాపులారిటీని తీసుకొచ్చింది. ఇది యూట్యూబ్‌లో దుమ్మురేపింది. నాగదుర్గ డాన్స్ ని హైలైట్‌ చేసింది. వీటితోపాటు `నాపేరు ఎల్లమ్మ`, `ఎర్ర రూమాల్‌`, `మామిడి కోనల మీన`, `దారిపొంటత్తుండు`, `జిల్లెలమ్మ జిట్ట`, `డిళ్లెం భళ్లెం ఎల్లమ్మ బోనం`, `అల్లల్లో నెరల్లో` వంటి పాటల్లో అదిరిపోయే డాన్సులతో ఆకట్టుకుంది. లేటెస్ట్ గా ఆమె `లగారే సౌండ్‌ సాలా` అనే పాటలో డాన్స్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ పాటు యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories