బిగ్ బాస్ హౌస్ లోకి లక్స్ పాప, సీజన్ 9 లో సందడి చేయబోతున్న బాలయ్య బ్యూటీ

Published : Aug 30, 2025, 10:34 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈసీజన్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈక్రమంలో కంటెస్టెంట్స్ విపయంలో రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్న తరుణంలో, బాలయ్య హీరోయిన్ ఈసారి బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

PREV
16

బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పటినుంచి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హడావిడి మొదలయ్యింది. లాస్ట్ సీజన్ ను మించి సీజన్ 9 ను ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. అందుకే నెల రోజుల ముందు నుంచే అగ్నిపరీక్ష పేరుతో హడావిడి మొదలుపెట్టారు. ఈసారి బిగ్ బాస్ లోకి సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసం సెలక్షన్స్ కూడా అయిపోయాయి. బిగ్ బాస్ లోకి వెళ్లే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరెవరు వెళ్తున్నారు అన్న విషయంలో రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎన్నో లిస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7, 2025 నుంచి ప్రారంభం కానుంది.

26

బిగ్ బాస్ లో బాలయ్య బ్యూటీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు సబంధించిన కంటెస్టెంట్స్ విషయంలో రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సెలబ్రిటీల పేర్ల విషయంలో కొన్ని లిస్ట్ లు కూడా రిలీజ్ అయ్యాయి. ఈక్రమంలోనే బిగ్ బాస్ సెలబ్రిటీలకు సబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. దక్షిణాది సినిమాల్లో ఓ సమయం లో గ్లామరస్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫ్లోరా షైని (Flora Saini), ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఆమె ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం.

36

లక్స్ పాప గా గుర్తింపు

2001లో విడుదలైన ‘నరసింహనాయుడు’ సినిమాలో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన ఫ్లోరా షైనీ, "లక్స్ పాప"గా తెలుగు ప్రేక్షకులలో ఎక్కువగా గుర్తింపు సాధించింది. తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘143’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చాలా త్వరగా గుర్తింపు సాధించింది కాని ఆమె టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది.

46

బాలీవుడ్‌లో  దూసుకెళ్లిన ఫ్లోరా

తెలుగులో మంచి గుర్తింపు తర్వాత ఫ్లోరా బాలీవుడ్‌కి మకాం మార్చింది. ఆమె ‘స్త్రీ’ వంటి హిట్ సినిమాలతో పాటు, పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించి సంచలనాలకు కారకురాలయ్యారు. ఓటీటీ వేదికలపై ఆమె నటనకు విశేష ఆదరణ లభించింది. బాలీవుడ్ లో బోల్డ్ నటిగా గుర్తింపుతో పాటు కొన్నివివాదాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.

56

కాంట్రవర్సీతో పాపులర్

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 9కి సంబంధించి ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు చర్చలో ఉన్నప్పటికీ, ఫ్లోరా షైనీ ఎంట్రీ మాత్రం దాదాపు ఖరారైనట్టుగా టెలివిజన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.తన బోల్డ్ పర్సనాలిటీ, వివాదాలకు భయపడని తత్వంతో ఫ్లోరా షైని బిగ్ బాస్ హౌస్‌కి అదనపు ఆకర్షణగా మారనుందని ట్రేడ్ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె హౌస్‌లోకి ప్రవేశించడం ద్వారా ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్‌ పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

66

సెకండ్ ఇన్నింగ్స్‌

బాలీవుడ్, ఓటీటీలో గుర్తింపు పొందిన ఫ్లోరా షైనీ, ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా తన తెలుగు సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆమె, బిగ్ బాస్‌లో తన గేమ్ ప్లాన్ ద్వారా మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్లోరా షైని ఎంట్రీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరింత రసవత్తరంగా మారనుంది. అభిమానులు ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆమె ఈ షోలో తన స్టైల్‌తో ఎలా రాణిస్తుందో చూడాలని వేచి చూస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజంఎంతో తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories