42 ఏళ్లు, నలుగురు హీరోయిన్లతో ఎఫైర్, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి రొమాంటిక్ హీరోగా మారిన నటుడు ఎవరో తెలుసా?

Published : Aug 30, 2025, 08:35 AM IST

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి.. రొమాంటిక్ హీరోగా ఇండస్ట్రీని ఊపేసిన ఓ స్టార్ హీరో, 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. నలుగురు హీరోయిన్లతో అఫైర్ వార్తలతో ఫేమస్ అయిన నటుడు ఎవరో తెలుసా? 

PREV
15

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు నటనతో, మరోవైపు వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారిపోతూ ఉండే ఈ స్టార్‌ హీరో గురించి తెలియని వారుండరు. 42 ఏళ్ల వయసులోనూ ఇంకా బ్యాచిలర్‌గా ఉన్న ఈ రొమాంటిక్ హీరో, తన కెరీర్‌ను ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి, ఇప్పుడైతే కోలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ ఎవరో తెలుసా?

25

ఆయన మరెవరో కాదు శింబు. తండ్రి టి. రాజేందర్‌ ఓ ప్రముఖ దర్శకుడు కావడంతో, శింబుకు చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశం లభించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు తమిళ చిత్రాల్లో నటించిన శింబు, అప్పట్లోనే నటనలో తన టాలెంట్‌ను ప్రూవ్ చేశాడు. ఆ తర్వాత యూత్‌ఫుల్ హీరోగా తెరంగేట్రం చేసి, లవ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో కూడిన సినిమాల్లో నటించి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

35

తెలుగు ప్రేక్షకులకు కూడా శింబు బాగా పరిచయం. ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే, మధ్యలో వరుస పరాజయాలతో వెనుకబడినా, ‘మానాడు’, వంటి విజయవంతమైన సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, శింబు మంచి సింగర్ కూడా. తాను నటించని సినిమాలకైనా గాత్రం అందించి, సంగీత అభిమానులను అలరించాడు. తెలుగులో కూడ కొన్ని సినిమాలకు గాత్రం అందించాడు స్టార్ హీరో.

45

సినిమా కెరీర్ అటు ఉంచితే.. వ్యక్తిగత జీవితంలో శింబు బాగా వైరల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్లతో అఫైర్ల విషయంలో శింబుకు స్పెషల్ ఇమేజ్ ఉంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా శింబు వ్యక్తిగత జీవితం మీడియాలో చర్చకు వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు నయనతార, త్రిష, హన్సిక, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లతో శింబు ప్రేమలో ఉన్నాడన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేశాయి. వీరిలో కొంతకాలం వరకు లవ్ రిలేషన్‌షిప్ నడిచినట్టు ప్రచారం జరిగింది. ఎక్కువగా నయనతార విషయంలోనే రచ్చ రచ్చ జరగింది.

55

ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన శింబు, ప్రస్తుతం తన 49వ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే థగ్ లైఫ్ భారీ అంచనాల మధ్య విడుదలై, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. తన కెరీర్‌ను రీబిల్డ్ చేస్తూ, ఇప్పటికీ సింగిల్‌గా కొనసాగుతున్న శింబు గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవతూనే ఉన్నాయి. మరో వైపు అభిమానులు, ఈ బ్యాచిలర్ స్టార్ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాడా? అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories