Bhimavaram:భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ మామూలోళ్లు కాదుగా..ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ ల్యాబ్ లో.. 

First Published Dec 21, 2023, 7:27 PM IST

మరికొన్ని గంటల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో సలార్ ఫీవర్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమా అంటే ఈ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ చిత్రం మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇండియా వ్యాప్తంగా సలార్ మ్యానియా మామూలుగా లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సలార్ పై అంచనాలు వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బాక్సాఫీస్ జాతర మొదలైంది. కనీవినీ ఎరుగని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. 

మరికొన్ని గంటల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో సలార్ ఫీవర్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమా అంటే ఈ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Latest Videos


కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరు కాబట్టి ప్రభాస్ కి కూడా ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఆ చుట్టుపక్కల భీమవరం లాంటి చోట్ల ప్రభాస్ అభిమానులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు అక్కడ గ్రాండ్ గా జరుగుతాయి.  ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే భీమవరం ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

తాజాగా భీమవరంలో ప్రభాస్ అభిమానులు తమ ప్రత్యేకత చాటుకున్నారు. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు తమ కంప్యూటర్ ల్యాబ్ లో అన్ని సిస్టమ్స్ లో సలార్ వాల్ పేపర్లు పెట్టి ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కంప్యూటర్ ల్యాబ్ మొత్తం సలార్ మ్యానియాతో నిండిపోయింది. ఈ దృశ్యాలు చూస్తూ నెటిజన్లు భీమవరం ఫ్యాన్స్ మామూలోళ్లు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో సలార్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ అంచనాలు మొదలయ్యాయి. కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఇండియా మొత్తం సలార్ హవా కనిపిస్తోంది. నిన్నటికి సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 30 లక్షలకి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. 

click me!