ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా క్లారిటీ..
ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై తాజాగా అవికా గోర్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె నిర్థారించారు. ఈ వార్త వినగానే..తనకు ఎలాంటి కోపం రాలేదని.. తాను, మిలింద్ చంద్వానీ వెంటనే నవ్వుకున్నాం అని అవికా చెప్పడం విశేషం. "ఈ వార్తలు నిజం కాదు, ఈ వార్త నాకు కూడా కొత్తే. ఇది నాకు కోపం తెప్పించలేదు. నిజానికి, ఇంత నమ్మకంతో ఇలాంటి వార్తలు వ్యాపింపజేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.ఆ వార్తలు చూడగానే నేను, మిలింద్ దీనిపై గట్టిగా నవ్వుకున్నాము." అని అవికా చెప్పారు.
అవికా గోర్ తెలుగులో ఉయ్యాల జంపాలతో తన కెరీర్ ని మొదలుపెట్టగా, తర్వాత వరసగా సినిమా చూపిస్తమావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 10క్లాస్ డైరీస్,థాంక్యూ, బ్రో , లక్ష్మీరావే మా ఇంటికి, రాజుగారి గది, పాప్ కార్న్ లాంటి సినిమాల్లో నటించారు.