షణ్ముఖ్ అరెస్ట్ పై రూమర్డ్ లవర్ సిరి హాట్ కామెంట్స్... ఎందుకు కలవడం లేదో చెప్పిన జబర్దస్త్ యాంకర్ 

First Published | Feb 26, 2024, 10:37 AM IST


గంజాయి సేవిస్తూ దొరికిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ డిప్రెషన్ లో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశాడట. కాగా షణ్ముఖ్ అరెస్ట్ పై, అతనికి దూరంగా ఉండటం పై రూమర్డ్ లవర్ సిరి హన్మంత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 

Siri Hanmanth

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ కలకలం రేపింది. తన నివాసంలో గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ పోలీసులకు కనిపించాడు. అక్కడ కొంత మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అనంతరం షణ్ముఖ్ బెయిల్ పై విడుదలయ్యాడు. 

షణ్ముఖ్ డ్రగ్స్ కి అలవాటు పడటానికి డిప్రెషన్ కారణం అని తెలుస్తుంది. ఈ విషయాన్ని అతడు స్వయంగా ఒప్పుకున్నాడట. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడట. షణ్ముఖ్ డిప్రెషన్ కి గురి కావడానికి దీప్తి సునైనతో బ్రేకప్ కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. 


Siri Hanmanth

బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ముగిసిన అనంతరం దీప్తి సునైన షణ్ముఖ్ కి బ్రేకప్ చేసింది. అందుకు ఆమె కారణాలు వివరించలేదు. ఇకపై తన దృష్టి కెరీర్ మీదే అని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ తన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నట్లు కనిపించాడు. 
 

అయితే దీప్తి బ్రేకప్ చెప్పడానికి సిరి హన్మంత్ కారణం అనే వాదన వినిపించింది. హౌస్లో షణ్ముఖ్-సిరి అత్యంత సన్నిహితంగా మెలిగారు. స్నేహితులం అని చెప్పుకుంటూ ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు చాలా పొసెసివ్ గా ఉండేవారు. ఇదంతా బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యారనే వాదన ఉంది. 
 

కాగా షణ్ముఖ్ అరెస్ట్ పై  సిరి తాజాగా స్పందించింది. అలాగే తమపై వచ్చిన రూమర్స్, ప్రస్తుతం షణ్ముఖ్ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడింది. హౌస్ నుండి బయటకు వచ్చాక తనపై ట్రోలింగ్ నడిచింది. రూమర్స్ బాధపెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను... అని సిరి అన్నారు.


ఇక షణ్ముఖ్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ... అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించలేదని అన్నది. ఇక షణ్ముఖ్ ని ఎందుకు కలవడం లేదంటే... అతనికి బ్రేకప్ అయ్యాక మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయాం, అన్నది. 

షణ్ముఖ్ ని మరలా కలిసే అవకాశం ఉందా అంటే.. కలిసినా కలవకపోయినా బాగుండాలని కోరుకుంటాను. కలవొచ్చు, కాకపోతే దానికి ఇంకా సమయం పడుతుందని సిరి చెప్పుకొచ్చింది. కాగా సిరి చాలా కాలంగా శ్రీహాన్ తో రిలేషన్ లో ఉంది. అతడు మాత్రం అర్థం చేసుకుని సిరితో రిలేషన్ కొనసాగిస్తున్నాడు... 

Latest Videos

click me!