`Kalki2898AD` టైటిల్‌ వెనకున్న కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.. షాకింగ్‌ మ్యాటర్ లీక్‌

Published : Feb 26, 2024, 09:37 AM ISTUpdated : Feb 26, 2024, 09:38 AM IST

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కి 2898 ఏడీ` గురించి షాకింగ్‌ విషయాలు, గూస్‌ బంమ్స్ తెప్పించే ఎలిమెంట్లు బయటపెట్టాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్. అవి వైరల్‌ అవుతున్నాయి. 

PREV
15
`Kalki2898AD` టైటిల్‌ వెనకున్న కథ చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.. షాకింగ్‌ మ్యాటర్ లీక్‌

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా `కల్కి2898ఏడీ` మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు దర్శకుడు. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీతోపాటు చాలా మంది కాస్టింగ్‌ ఇందులో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. దీంతో సినిమాపై హైప్‌ మామూలుగా లేదు. ఎలా ఉంటుందో అని అంతా ఆతృతతో వెయిట్‌ చేస్తున్నారు. అయితే సినిమా మైథలాజికల్‌ అంశాలతోపాటు సైన్స్ ఫిక్షన్‌ ఎలిమెంట్లతో సాగుతుందని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. టీమ్‌ నుంచి అలాంటి సమాచారం బయటకు వచ్చింది. 
 

25

ఫస్ట్ టైమ్‌ `కల్కి2898ఏడీ` టైటిల్‌ వెనకున్న కథేంటో చెప్పాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందులో సినిమా గురించి ఆసక్తికర విషయాలను, ఒక షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. ఈ సినిమా ప్రారంభం.. మహాభారతం నుంచి ప్రారంభమవుతుందట. 2898ఏడీ లో ముగుస్తుందట. అలా ఇది 6000 సంవత్సరాల టైమ్‌ స్పాన్‌లో సాగుతుందనే షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు నాగ్‌ అశ్విన్‌.

35

అయితే కృష్ణుడి చివరి అవతారం కల్కి అని, టైమ్‌ పీరియడ్‌లో 2898ఏడీ నుంచి 6000 సంవత్సరాలు బ్యాక్‌ వెళితే కల్కి మరణం వరకు 3100బీసీకి వెళ్తుందని వెల్లడించారు. మొదటి పార్ట్ `కల్కి2898ఏడీ` అనే టైటిల్‌ పెట్టడానికి కారణం ఇదే నాగ్‌ అశ్విన్‌ వెల్లడించారు. అలాగే రెండో పార్ట్ కి `కల్కి3100బీసీ` అనే టైటిల్‌ పెట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇది బ్లేడ్‌ రన్నర్‌ లాంటి మూవీ కాదని, ఇండియన్‌ మూవీ అని, ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని ఆయన చెప్పారు. సినిమాని గూస్‌బంమ్స్ తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చాడు.
 

45

ఈ లెక్కన మూవీ మహాభారతంలోని కృష్ణుడి అవతారం నుంచి విష్ణు అవతారం, అలాగే కల్కి అవతారం వరకు చూపిస్తూ, దాన్ని భవిష్యత్‌ 2898ఏడీ కాలం వరకు తీసుకెళ్లబోతున్నారు. ఈ మధ్య పరిణామాలను, భవిష్యత్‌ కాలాన్ని ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నారు నాగ్‌ అశ్విన్‌. అందుకే ఇందులో ప్రభాస్‌.. కృష్ణుడిగా, విష్ణువుగా, కల్కిగా కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ మూడు అంశాలను ఎలా బ్లెండ్‌ చేయబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడు, మన ఆడియెన్స్ కి అర్థమయ్యేలా ఎలా చెప్పబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే క్యూరియాసిటీని పెంచుతుంది. 

55

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.ఇటీవలే ప్రభాస్‌, దిశా పటానీలపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ని షూట్‌ చేశారట. ఈ మైథలాజికల్‌ మూవీలో ఈ రొమాంటిక్‌ సాంగ్‌ ఎలా సెట్‌ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు సినిమాలో మెయిన్‌ కాస్టింగ్‌తోపాటు గెస్ట్ లుగా విజయ్‌ దేవరకొండ, నాని, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, మృణాల్‌ ఠాకూర్‌ వంటి కాస్టింగ్‌ యాడ్‌ కావడం కూడా మరింత ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. సినిమా సూపర్‌ హీరో యూనివర్స్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈమూవీని మే 9న విడుదల చేయబోతున్నారు. ఆ రోజు వస్తుందా రాదా అనేది మార్చి 8న తేలనుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories