లేదమ్మా నాకు పొలంలో కొంచెం పని ఉంది వచ్చేటప్పుడు నేను తీసుకొని వస్తాను అంటాడు విక్రమ్. అప్పుడు రాజ్యలక్ష్మి , ప్రియ ని పిలిచి ఆ గదిలో స్వీట్స్ బట్టలు ఉంటాయి తీసుకొని రా అని చెప్తుంది. రాజ్యలక్ష్మి చెప్పినట్లే చేస్తుంది ప్రియ. వీటిని తీసుకొని నువ్వు కూడా దివ్యకి తోడుగా వెళ్ళు అని చెప్తుంది రాజ్యలక్ష్మి. అత్త ప్రవర్తనికి కోడళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. చూసావా మా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మనసు నిండిపోవాల్సిందే అంటాడు విక్రమ్. ఇంతలో నందుకు ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వు ఇక్కడికి రావద్దు వీలు చూసుకుని నేనే వస్తాను అని చెప్తాడు.