వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేజర్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.
27
26/11 ముంబై దాడులలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచిన బ్రేవ్ సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన జిఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అనేదానికి 5 బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
37
అడివి శేష్ : తన ప్రతి చిత్రంలో పెర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేసే అడివి శేష్.. ఈ చిత్రంతో అతడి నటన పీక్స్ కి చేరింది. సిల్వర్ స్క్రీన్ పై అడివి శేష్ కనిపించడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నే చూస్తాం. చూస్తాం అనడం కంటే మేజర్ సందీప్ మన పక్కనే ఉంటాడు ని చెప్పడం బెటర్ ఏమో. అంతలా అడివి శేష్ పాత్రలో లీనం ఐపొతాము. కాలేజీ కుర్రాడిగా కనిపించినా, ప్రేమికుడిగా కనిపించినా, సైనికుడిగా కనిపించినా అడివి శేష్ చూపించిన వేరియేషన్ అద్భుతం. సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం.
47
క్లైమాక్స్: మరో బలమైన కారణం ఈ చిత్ర క్లయిమాక్స్. దేశభక్తి, మిలటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన చిత్రాలు క్లైమాక్స్ లో హెవీగా, ఎమోషనల్ గా ఉంటాయి. వాటికి ఈ చిత్రం భిన్నం. ఎమోషనల్ గా ఆకట్టుకుంటూనే క్లైమాక్స్ ని మతి పోగొట్టే విధంగా ప్రజెంట్ చేశారు. ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ అడివి శేష్ పూర్తిగా సందీప్ తనని ఆవహించినట్లు చెలరేగిపోయాడు నటనతో.
57
Image: Adivi Sesh/Instagram
దర్శకత్వం: ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకుడు. సినిమాలో ప్రతి షాట్, ప్రతి అంశం ఏదో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఇస్తూనే ఉంటుంది. ఇక పది నిమిషాలకు ఓసారి వచ్చే గూస్ బంప్స్ మూమెంట్స్ బోనస్ అనే చెప్పాలి. కథని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంలో సందీవ్ కథని అతడి తల్లి దండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్, రేవతి చెబుతారు. ఇది అద్భుతమైన ఐడియా. ఎందుకంటే ఒక కొడుకు గురించి బాగా తెలిసేది తల్లి దండ్రులకు మాత్రమే. సందీప్ గురించి ప్రతి పాయింట్ ప్రకాష్ రాజ్ తో చెప్పిస్తూ అద్భుతమైన నేరేషన్ ఇచ్చాడు దర్శకుడు.
67
Image: Adivi Sesh/Instagram
కథ: మేజర్ మూవీ ఒక దేశభక్తి చిత్రం మాత్రమే కాదు. ఈ చిత్ర కథ, కథనాలు ఎంగేజింగ్ గా ఉంటూ అలరిస్తాయి. సాధారణంగా వచ్చే దేశభక్తి చిత్రాలకు మేజర్ మూవీ భిన్నంగా ఉంటుంది. ఇందులోని ప్రేమ కథ కూడా సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. కథ, అడివి శేష్ నటనతో సినిమా చూస్తున్నాం అని ప్రేక్షకులు మరచిపోయి లీనమైపోతారు.
77
Image: Adivi Sesh/Instagram
100 శాతం పైసా వసూల్: దేశ భక్తి చిత్రం కాబట్టి కేవలం కొందరు ఆడియన్స్ కి మాత్రమే అనుకుంటే పొరపాటే. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సందీప్ పాత్ర మనల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎఫెక్ట్ ఏస్థాయిలో ఉంటుంది. ఒక కమర్షియల్ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తామో అంతకు మించిన హై మూమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. మేజర్ మూవీ పక్కా పైసా వసూల్ బొమ్మ.