Guppedantha Manasu: జగతి మాటలకు ఆలోచనలో పడ్డ రిషి.. రిషికి దూరంగా వెళ్ళిపోతున్న వసుధార?

First Published Dec 16, 2022, 8:57 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో దేవిని సంతోషంగా ధరణిని అని పిలవగా ధరణి అక్కడికి వచ్చి కాఫీ అని అనబోతుండగా కాఫీలు తాగడానికి నేను పుట్టలేదు. నువ్వు కాఫీలు చేయడానికి పుట్టలేదు అవునా కాదా అనగా అవునేమో అత్తయ్య అని వెటకారంగా మాట్లాడుతుంది ధరణి. అవునేమో ఏంటి ఇదేంటి వెటకారం సరేలే ఈ రోజు నువ్వు ఏం మాట్లాడినా నాకు కోపం రాదు అదేంటి అత్తయ్య గారు అనగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది దేవయాని. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా ధరణి అనడంతో అవును అత్తయ్య స్వీట్ తీసుకుని కావాలా అనడంతో అవసరం లేదు అని అంటుంది.
 

 స్వీట్ కాకుండా ఈసారి ఏదైనా హాట్ గా తీసుకొనిరా అని సంతోషంగా చెబుతుంది దేవయాని. నాతో నువ్వు చాలెంజ్ చేశావు వసుధార ఆవేశం ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది ఇది నా సగం గెలుపు వసుధార అని సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి వసుధార కోసం బొకే తీసుకొని వస్తుండడం చూసి దేవయాని ఆశ్చర్య పోతుంది. అప్పుడు రిషి పెద్దమ్మ వసుధార ఎక్కడ ఉంది అని అడగగా దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని వసుధార లేదు నాన్న అని అనగా ఎక్కడికి వెళ్ళింది పెద్దమ్మ అనడంతో వెళ్లే వాళ్ళందరూ నాకు చెప్పి వెళ్తారా ఏంటి నాన్న రిషి అని అంటుంది.
 

 కాలేజీలో ఎవరో ఏదో అన్నారట దాంతో కోపంగా వచ్చి ఇల్లు వద్దు మీరు వద్దు అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనడంతో రిషి షాక్ అవుతాడు. ఇప్పుడు దేవయాని నాటకాలు వాడుతూ ఎవరు ఏమన్నారు చెప్పు వాసు ద్వారా అని అడిగాను కానీ చెప్పకుండా వెళ్ళిపోయింది అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. నాకే కాదు రిషి నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అంటూ రిషి ని రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు రిషి కోపంగా జగతీ గదిలోకి వెళ్తాడు. వసుదార ని ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మ చెప్పింది ఏం జరిగింది చెప్పండి మేడం అనడంతో అక్కయ్య గారు తనకు అనుగుణంగా చెప్పుకొని ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జగతి.
 

వసుధార ని ఎవరు ఏమన్నారు చెప్పండి మేడం వాళ్ళ సంగతి చెప్తాను అనగా ఎంతమందిని చెబుతావు రిషి అని అంటాడు అంటుంది జగతి. ఏం చేస్తావు రిషి ఒకవేళ నేను ఇవ్వదు జరిగిందే మొత్తం చెబితే వాళ్ల మీద పోయి అరుస్తావు రేపు మళ్లీ ఇంకొకరు వచ్చి అలాగే మాట్లాడతారు వాళ్ళ మీద కూడా అరుస్తావా అని అంటుంది జగతి. దాంతో జగతి మాటలకు ఆలోచనలో పడతాడు రిషి. అసలు మగ ఆడ మధ్య సంబంధం గురించి ఎదుటివారికి చెప్పుకోవాల్సిన అవసరం రాకూడదు అలా చెప్పుకుంటూ వెళితే అది బంధమే కాదు రిషి అని అంటుంది. దాంతో రిషి షాక్ అవుతాడు. వసుధార ఎక్కడికి వెళ్లింది మేడమ్ అనడంతో ఎక్కడైతే తన బంధాలను వదులుకొని వచ్చిందో ఎక్కడిది తన రక్తసంబంధీకులను వదులుకొని వచ్చిందో అక్కడికే వెళ్లింది అని అంటుంది జగతి.
 

అప్పుడు జగతి మాటలకు ఆలోచనలో పడ్డ రిషి కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార ఇంటికి వెళ్ళగా అక్కడ తన ఇంట్లో ఇంటి ఓనర్ ఉండడంతో ఏంటి పెద్దమ్మ మీరు ఇక్కడ ఉన్నారు అని అడగగా ఏం చేస్తాం అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు వస్తావా రావో కూడా తెలీదు అంటూ వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. ఎందుకు పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు అనగా నీకు రూమ్ అద్దెకు ఇచ్చిన పాపానికి నేను అనుభవిస్తున్నాను అని గదిలోకి ఎవరెవరు వస్తారు ఎవరెవరో పోతారు అంటూ వసుధార ని నానా మాటలు అంటుంది. ఇప్పుడు రిషి వసుధార గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుంది.
 

అప్పుడు వసుధార బయట నిలబడి ఉండగా వసుధార లగేజ్ మొత్తం బయటికి విసిరేస్తుంది ఆ ఇంటి ఓనర్. దాంతో వసుధర కుమిలి కుమిలి ఏడుస్తూ తన లగేజ్ తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు కాలేజీ స్టాఫ్ ఇంటి ఓనర్ అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది వసుధార. ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు రిషి రావడంతో సార్ అని అనగా నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు  అని అంటాడు. అప్పుడు ఏం జరిగింది వసుధార ఇల్లు ఖాళీ చేసావా అనడంతో లేదు సార్ చేయించారు అని అంటుంది వసుధార. ఎందుకు అని మీరు అడిగారు కానీ ఎందుకు అన్నది నేను చెప్పలేను కానీ మాటలతో చాలా బాధ పెట్టారు సార్ అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార మాట్లాడిన బట్టి రిషి కొంత ఊహించగలరు అని అంటాడు. టెక్నాలజీ మారింది డెవలప్ అయింది అంటున్నారు కానీ ఆడపిల్ల మాత్రం సమాజం దృష్టిలో అలాగే ఉంది సర్ అని అంటుంది వసుధార. అప్పుడు జరిగిన విషయాలు అన్ని తలుచుకొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది వసుధార.

ఆడ మగ కనిపిస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు చూడరు చేయరు కానీ ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు అని అంటుంది వసుధార. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటాడు. అప్పుడు రిషి వసుధార మా ఇంటికి వెళ్దాం పద అనడంతో మీరే మీ ఇల్లు అన్నారు కదా సార్ మరి ఆ ఇంటికి నాకు ఏంటి సార్ సంబంధం అని అంటుంది. ఏ అర్హతతో నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటుంది వసుధార. నేను ఆ ఇంటికి ఏ హక్కుతో రావాలి చెప్పండి సార్ అని నిలదీస్తుంది వసుధార. ఇంట్లో కూర్చుంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి సార్ అని అనడం బాధపడుతూ ఉంటుంది వసు. అందరికీ నేను సమాధానం చెప్పాలి అనుకోవడం లేదు సార్ మా ఊరికి వెళ్ళిపోతున్నాను సార్ అనడంతో రిషి షాక్ అవుతాడు.

click me!