Pawan Kalyan: శత్రువులు ఎక్కడో లేరు ఫ్యాన్స్ రూపంలో... పవన్ కలలకు సమాధి కడుతున్న అభిమానులు..!

Published : May 30, 2022, 06:27 PM ISTUpdated : May 30, 2022, 09:51 PM IST

అతి అనర్థానికి దారి తీస్తుంది. దేనికైనా ఒక హద్దు ఉండాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయం ఎప్పుడు అర్థం అవుతుందో తెలియడం లేదు. ఇతర స్టార్ హీరోలతో గొడవలు పెట్టుకుంటూ వాళ్లకు తెలియకుండానే పవన్ కి తీరని అన్యాయం చేస్తున్నారు.

PREV
18
Pawan Kalyan: శత్రువులు ఎక్కడో లేరు ఫ్యాన్స్ రూపంలో... పవన్ కలలకు సమాధి కడుతున్న అభిమానులు..!
Pawan Kalyan

ఫ్యాన్ వార్స్ పవన్ (Pawan Kalyan) పొలిటికల్ కెరీర్ కి దెబ్బ తీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ వార్స్ ఏ పరిశ్రమలో అయినా చాలా సహజం. ప్రతి స్టార్ హీరో అభిమాని తమ హీరోనే గొప్పంటాడు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం చెప్పాలంటే మాటలు చాలవు. పవన్ నంబర్ వన్ అనుకోవాలని ఎంతకైనా తెగిస్తారు. సమయం సందర్భం లేకుండా పనిగట్టుకొని సోషల్ మీడియాలో ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ ఉంటారు.

28
pawan kalyan

అంత వరకు ఒకే... ఇతర హీరోల సినిమాలపై నెగిటివ్ టాక్, అవమానకర ట్యాగ్స్ ట్రెండ్ చేస్తారు. తమ హీరో రికార్డ్స్ కోసం ఒకటి పది సార్లు నచ్చకపోయినా చూస్తారు. అదే సమయంలో ఇతర హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ రాకుండా అర్థ రాత్రి నుండే సినిమా ప్లాప్ అంటూ ప్రచారం చేస్తారు. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా విషయంలో వీరు చేసిన నెగిటివ్ ప్రచారం లిమిట్స్ దాటిపోయింది.
 

38
Allu arjun - Pawan Kalyan

మహేష్ (Mahesh Babu)ఫ్యాన్స్ కి పవన్ ఫ్యాన్స్ అంటే ఏమాత్రం గిట్టని పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే తమ ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ సమావేశంలో అల్లు అర్జున్ మెగా హీరో కాదు. మెగా ఫ్యాన్స్ అతనికి మద్దతు ఇవ్వకూడదంటూ తీర్మానం చేశాడు. దీంతో రగిలిపోయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'ఏం పీకలేరు బ్రదర్' అంటూ పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు.
 

48

అల్లు అర్జున్ (Allu Arjun) రికార్డ్స్ తో చరణ్, పవన్, చిరు రికార్డ్స్ పోల్చుతూ ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తి బహిరంగ క్షమాపణ కోరడంతో ఆ గొడవ అలా సద్దుమణిగింది. పవన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో అసహనం అలానే ఉండి పోయింది. పవన్ పేరు చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నప్పటి నుండి పవన్-బన్నీ ఫ్యాన్ మధ్య గ్యాప్ నడుస్తుంది. 
 

58
Pawan Kalyan

తాజాగా ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ని గెలికారు. ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పవన్ అభిమాని ఒకరు దారుణమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్ వార్ కి దిగారు. పవన్ ప్రభాస్ కి క్షమాపణలు చెప్పాలంటూ (#PKShouldSayApologizeToPrabhas) ఓ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇది ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.
 

68

వరుస పరిణామాలు గమనిస్తున్న పవన్ శ్రేయోభిలాషులు... అభిమానులే ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయంగా అందరి మద్దతు కూడగట్టాల్సింది పోయి పవన్ కి లేని శత్రువులను తయారు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోల ఫ్యాన్స్ తో విబేధాలు క్షేత్ర స్థాయిలో పవన్ ని రాజకీయంగా దెబ్బతీస్తాయి. పవన్ని కూడా అభిమానించే ఇతర హీరోల ఫ్యాన్స్  దూరమయ్యే అవకాశం కలదు.

78

 ఫ్యాన్స్ కారణంగా ఇతర హీరోల ఫ్యాన్స్ లో పవన్ పై గూడుకట్టుకున్న అసహనం ప్రతికూల ప్రభావం చూపించే ఆస్కారం లేకపోలేదు. పవన్ ప్రభాస్ కి క్షమాపణ చెప్పాలనే ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా... ప్రభాస్ సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాలలో జనసేన నష్టపోయే ప్రమాదం ఉంది... ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని జనసేన (Janasena) కార్యకర్తలు ట్వీట్ చేయడం గమనార్హం.

88
pawan kalyan


కాబట్టి అతి అభిమానంతో పవన్ ఫ్యాన్స్ రాజకీయంగా, సినిమాల పరంగా నష్టం చేకూర్చుతున్నారు. శత్రువుల కంటే కూడా అభిమానులే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. సీఎం కావాలనే పవన్ కలను నాశనం చేస్తున్నారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. ఒకటి రెండు సందర్భాల్లో ఆయనే ఒప్పుకున్నారు. మరి వాళ్ళు నిజంగా మేలు చేసే అభిమానులుగా ఎప్పుడు పరిపక్వత సాధిస్తారో...

Read more Photos on
click me!

Recommended Stories