నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నా.. ప్రేమ వివాహామే చేసుకుంటా.! హీరోయిన్ అనుపమా షాకింగ్ కామెంట్స్..

Published : May 30, 2022, 04:05 PM IST

కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలను బయటపెట్టింది. తను ఇప్పటికే ఒకరితో లవ్ లో ఉన్నానని, ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతోంది.   

PREV
16
నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నా.. ప్రేమ వివాహామే చేసుకుంటా.! హీరోయిన్ అనుపమా షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వరుస చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అదేవిధంగా విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం రెండు, మూడు చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ.
 

26

అనుపమా నటిస్తున్న చిత్రాల్లో విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘బటర్ ఫ్లై’  (Butterfly Movie) ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. ఇప్పటికే వాయిదా పడుతూ ఎట్టకేళలకు రిలీజ్ కు సిద్ధమైంది. త్వరలో థియేట్రికల్ మరియు ఓటీటీ రిలీజ్ డేట్స్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. 
 

36

దీంతో ప్రస్తుతం ప్రమోషన్స్ ను మాత్రం షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా యూట్యూబర్ నిఖిల్ కు ‘బటర్ ఫ్లై’ యూనిట్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూకు హీరోయిన్ అనుపమా, నటుడు నిహాల్ కోదాటి, దర్శకుడు గంటా సతీశ్ బాబు హాజరయ్యారు. 
 

46

యాంకర్ నిఖిల్ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుపమా పర్సనల్ లైఫ్ పై ప్రశ్నలు సంధించాడు. మీరు సింగిల్ గానే ఉంటున్నా? జీవితంలో పెళ్లి చూపులకు వెళ్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు. ఇందుకు అనుపమా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

56

‘నేను పెళ్లి చూపులకు వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను. అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోను. ఇప్పటికే ప్రేమలో ఉన్నాను. కానీ వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తోంది. నా రిలేషన్ షిప్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు.’ అంటూ బదులిచ్చింది. గతంలోనూ ఓ రిపోర్టర్ మ్యారేజ్ పై ప్రశ్నించగా.. నేనింకా చిన్నపాపనే నాకింకా ఇండస్ట్రీలో చాలా ఎదగాలని ఉందంటూ బదులిచ్చింది. 
 

66

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్ర. భూమికా చావ్లా మరియు నిహాల్ కొధాటి చిన్న పాత్రలు పోషిస్తున్నారు. గంటా సతీష్ బాబు కథ మరియు స్క్రీన్‌ప్లేను నిర్వహించాడు మరియు చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రాన్ని జెన్ నెక్ట్స్ మూవీస్ పతాకంపై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఫిబ్రవరి 18నే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరో డేట్ ను కన్ఫమ్ చేయనుంది.
 

click me!

Recommended Stories