పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు!

First Published Sep 2, 2020, 7:12 AM IST

పవర్‌ స్టార్ బర్త్‌ అంటే అభిమానులకు పండుగ రోజు. అందుకే  ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా బహిరంగ వేడుకలకు అవకావం లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మార్షల్‌ ఆర్ట్స్ ప్రదర్శన సందర్భంగా ఆయన గురువు పవన్‌ అనే పేరును కళ్యాణ్‌కు ముందు జోడించటంతో అప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్ అయ్యాడు.
undefined
పవన్‌ అనే పేరు కళ్యాణ్ బాబుకు ఎంతో కలిసొచ్చింది. ఈ పేరుతోనే కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మందికి ఆరాధ్యుడిగా మారిపోయాడు.
undefined
పవన్‌ కళ్యాణ్‌ కరాటేలో బ్లాక్‌ బెల్డ్‌ సాధించాడు. ఎన్నో సంవత్సరాల పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను అభ్యసించాడు.
undefined
పవన్‌ కళ్యాణ్‌ పూర్తి శాఖాహారి, ఆయన నాన్‌ వెజ్‌ అస్సలు తినడు.
undefined
హీరోనే కాదు డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, సింగర్‌గా, స్టంట్‌ కోఆర్టినేటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రాజకీయ నాయకుడిగానూ సత్తా చాటిన పవన్‌.
undefined
సౌత్‌ ఇండియా నుంచి పెప్సీ యాడ్‌లో కనిపించిన తొలి హీరో పవన్‌ కళ్యాణే కావటం విశేషం.
undefined
పవన్‌ కళ్యాణ్‌కు క్యూబా విప్లవ వీరుడు చెగువరా అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో తరుచూ చే ఫోటోలు కనిపిస్తుంటాయి.
undefined
ఇతర స్టార్స్‌ లా ఖాళీ సమయంలో పబ్‌, విదేశీ టూర్లు చేయటం పవన్‌కు నచ్చదు. ఆయన ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ, తన ఫాం హౌస్‌లో వ్యవసాయం చేస్తూ గడిపేస్తుంటాడు.
undefined
పవన్‌ ముందుగా డైరెక్టర్‌ కావాలనే అనుకున్నాడు. కానీ చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితో పవన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
undefined
పవన్‌ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి డిజాస్టర్‌. కానీ నాలుగు సినిమా తొలిప్రేమ సంచలనాలు నమోదు చేసింది. ఈ సినిమాకు జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులు వచ్చాయి.
undefined
ఖుషీ, గబ్బర్‌ సింగ్‌, అత్తారింటికి దారేది సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్‌లను సృష్టించిన పవన్‌ కళ్యాణ్.
undefined
1997లోనే వివాహం చేసుకున్న పవన్‌ కళ్యాణ్, ఆమెతో మనస్పర్దలు రావటంతో చాలాకాలం దూరంగా ఉండి 2007లో విడాకులు తీసుకున్నాడు. తరువాత 2007లో రేణు దేశాయిని పెళ్లి చేసుకొని ఆమెకు 2012లో విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత రష్యాకు చెందిప అన్నా లెజనోవాను మూడో వివాహం చేసుకున్నాడు పవన్‌.
undefined
ఇండస్ట్రీ వర్గాలతోనూ పవన్‌ చాలా సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా అర్జున్‌ సినిమా పైరసీ సమయంలో మహేష్ బాబుకు మద్దతుగా నిలిచాడు పవన్‌ కళ్యాణ్.
undefined
గూగుల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2014 ఎన్నికల సమయంలో అత్యధిక మంది వెతికిన సెలబ్రిటీ పొలిటిషన్‌ పవన్‌ కళ్యాణే.
undefined
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉండే పవన్‌, ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటాడు పవన్‌.
undefined
ఫాలోయింగ్ విషయంలో నెంబర్ వన్ స్థాయికి వచ్చిన పవన్‌ అవార్డుల విషయంలో మాత్రం వెనకపడ్డాడు. కేవలం ఒకే ఒక్కసారి ప్రతీష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న పవన్‌. ఆ తరువాత ఆ స్థాయి ప్రస్టీజియస్‌ అవార్డును అందుకోలేదు.
undefined
click me!