నాగార్జునని తిట్టడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన లావణ్య.. పవన్‌ కళ్యాణ్‌ వద్దకు రాజ్‌ తరుణ్‌ పంచాయతీ?

Published : Jul 12, 2024, 06:34 PM IST

రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం రోజు రోజుకి మరింతగా ముదురుతుంది. మరింత రచ్చ రచ్చ అవుతుంది. నాగార్జునని తిట్టడంపై లావణ్య స్పందించింది. పవన్‌ ముందుకు వెళ్తానంటోంది. 

PREV
16
నాగార్జునని తిట్టడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన లావణ్య..  పవన్‌ కళ్యాణ్‌ వద్దకు రాజ్‌ తరుణ్‌ పంచాయతీ?
Raj Tarun and Lavanya

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్యల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో కంపు కంపుగా మారుతుంది. లావణ్యపై రాజ్‌ తరుణ్‌ చేస్తున్న ఆరోపణలు, రాజ్‌ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణలు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. రాయడానికి వీల్లేని విధంగా బూతులు తిట్టుకుంటూ, బూతు వ్యవహారాలు బయటపెట్టుకుంటూ పెంట పెంట చేసుకుంటున్నారు. వీరి వివాదం ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అవుతుంది. 
 

26

సినిమా వాళ్లంటే ఇలానే ఉంటారా? ఇలానే చేస్తారా? అని జనం అనుకునేలా ఈ ఇద్దరు వ్యవహరిస్తుండటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఇటీవల రాజ్‌ తరుణ్‌, లావణ్య, సాయి ముగ్గురు మధ్య ఫోన్‌ కన్వర్జేషన్‌ లీక్‌ చేశారు. ఇందులో లావణ్య బూతుల వర్షం కురిపించింది. రాజ్‌ తరుణ్‌ కూడా అలానే స్పందించడం పెద్ద రచ్చ అయ్యింది. దీంతో లావణ్య కూడా మరో ఆడియోని విడుదల చేసింది. ఇద్దరు ఒకరి బండారాలను మరొకరు బయటపెట్టుకుంటున్నారు.

36
Nagarjuna Akkineni

అయితే మొదటి ఆడియోలో నాగార్జున పేరు కూడా వాడింది లావణ్య. అన్నపూర్ణ స్టూడియో, `ఉయ్యాల జంపాల` ప్రొడ్యూసర్‌ ఎవరు వాడు, అక్కడికి వెళ్తా అంటూ కొన్ని బూతు పదాలు వాడింది లావణ్య. దీంతో ఇది మరింత వివాదంగా మారింది. నాగ్‌ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించింది లావణ్య. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పింది. క్యూబ్‌ టీవీతో మాట్లాడుతూ రాజ్‌ తరుణ్‌తో తాను మాట్లాడుతున్నప్పుడు `నువ్వు ఎక్కడికైనా వెళ్లు, నేను చూసుకుంటా..` అని ఇలా కేర్‌ లెస్‌గా మాట్లాడుతున్నాడు. అది నాకు చాలా కోపంగా అనిపించింది. అలా నాగార్జున పేరు ప్రస్తావన తీయాల్సి వచ్చిందని చెప్పింది. `నాకు ఒక మనిషి అవసరం. దాన్ని ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. దీంతో గొడవ అయ్యింది. ఆ సమయంలో దెబ్బలు తగిలాయి. కొట్టాడు కూడా. ఆ టైమ్‌లో మాట మాట పెరిగి గొడవ అవుతుంది. పర్టిక్యూలర్‌గా ఇది కారణం అని కాదు. కొట్టుకునేలా జరిగాయి. కానీ ఇన్నాళ్లు అవి బయటకు చెప్పలేదు.
 

46

ఈ ఏడాది బయటకు రావాల్సి వచ్చింది. సెప్టెంబర్‌కి ముందు గొడవలు లేవు. సరదాగా నేనే కొట్టేదాన్ని, నా కంటే ఆర్నెళ్లు చిన్న అతను. కానీ నన్ను వెళ్లిపో అనేవాడు. దాన్ని నేను తీసుకునేదాన్ని కాదు. ఈ క్రమంలో పెద్దగా గొడవ అయ్యేది. రాజ్‌ తరుణ్‌ నన్ను సెటిల్మెంట్‌ చేసుకో అంటున్నాడు. కానీ నాకు సెటిల్మెంట్‌ వద్దు. రాజ్‌ తరుణే కావాలి. మనీ కోసం చేస్తున్నానని అంతా అంటున్నారు. అలా ఎందుకురీచ్‌ అవుతుందో తెలియదు.

56

నాకు సెటిల్మెంట్‌ వద్దు, ఆయనే కావాలి. నేను అతనికి డిపెండెంట్ అయ్యాడు. వర్క్ చేయడం లేదు. నాకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది. నా పరిస్థితి ఏంటి? అని అడిగితే హౌజ్‌ ఇస్తా అంటున్నాడు. పైగా పదిహేను కుక్కలున్నాయి. వాటి మెయింటనెన్స్ కి ఇస్తాను. అవి కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకున్నాకే. మాల్వీకి కుక్కలంటే నచ్చదు. అందుకే నా వద్ద ఉంచుతాను, వాటికి పే చేస్తానని చెబుతున్నాడు అని వెల్లడించింది లావణ్య. 

 

66

తనకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ రావడం లేదు. రాజ్‌కి రాజా రవీంద్ర సపోర్ట్ చేస్తున్నాడేమో. కానీ నాకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను, నాకు హెల్ప్ కావాలి. నాకు శివుడంటే ఇష్టం. అలాగే మనుషుల్లో పవన్ కళ్యాణ్‌ అంటే ఇష్టం. ఆయన సీఎం అవుతాడని అనుకున్నాను. ఆయనకుపెద్ద అభిమానులం. ఆయన్ని కలిసి సహాయం చేయాలని అడగాలని అనుకుంటున్నా` అని తెలిపింది లావణ్య. నెమ్మదిగా వివాదాన్ని పవన్‌ కళ్యాణ్‌ముందు ఉంచే ప్రయత్నాలు చేస్తుంది లావణ్య. మరి ఇది ఎటు వైపు వెళ్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories