జబర్దస్త్ కమెడియన్స్ రోజా కాళ్ళ మీద పడ్డారు... రాకింగ్ రాకేష్ సంచలన కామెంట్స్!

Published : Jun 26, 2024, 04:57 PM IST

ఎన్నడూ లేని విధంగా జబర్దస్త్ కమెడియన్స్ వేదికగా రాజకీయాలు నడిచాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో విస్తృత ప్రచారం చేశారు. కాగా కిరాక్ ఆర్పీ రోజాను దారుణంగా టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో రోజా ఎలాంటి వారో బయటపెడుతూ రాకింగ్ రాకేష్ కీలక కామెంట్స్ చేశాడు.   

PREV
16
జబర్దస్త్ కమెడియన్స్ రోజా కాళ్ళ మీద పడ్డారు... రాకింగ్ రాకేష్ సంచలన కామెంట్స్!
Rocking Rakesh

జబర్దస్త్ తో రోజాకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2013లో జబర్దస్త్ మొదలు కాగా రోజా, నాగబాబు జడ్జెస్ ఎంట్రీ ఇచ్చారు. ఎనిమిదేళ్లకు పైగా రోజా ఆ షోలో ఉన్నారు. మంత్రి అయ్యాక షో మానేయడం జరిగింది. 
 

26

సుదీర్ఘ జర్నీలో జబర్దస్త్ కమెడియన్స్, యాంకర్స్ తో ఆమెకు స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. వారు రోజాను అభిమానించేవాళ్ళు. గౌరవించేవాళ్ళు. ఎన్నికల విషయంలో మాత్రం రోజాకు పూర్తి వ్యతిరేకంగా జబర్దస్త్ కమెడియన్స్ మాట్లాడారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు. 

 

36
Kiraak RP

కిరాక్ ఆర్పీ రోజాను గట్టిగా టార్గెట్ చేశాడు. ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ కీలక విషయాలు వెల్లడించాడు. రాకింగ్ రాకేష్ నగరిలో రోజా తరపున ప్రచారం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ రోజా పై ఆరోపణలు చేయడంపై స్పందించాడు. 

46
Kiraak RP


రోజా నాకు అమ్మతో సమానం. నేను అమ్మ అనే అంటాను. ఆమె మీద అభిమానంతో నగరి వెళ్ళాను. నాది ఉడతా భక్తి లాంటిది. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలబడింది. నాతో పాటు చాలా మంది ఆమె సహాయం పొందారు. నా చేతుల ద్వారా కూడా ఎంత మందికి ఆమె మేలు చేశారో నాకు తెలుసు. 

56

పరుగున వెళ్లి ఆమె కాళ్ళ మీద పడితే వెంటనే సహాయం చేసేవారు. ఆమె ఆస్తులు అమ్మి కూడా సహాయం చేస్తారు. రోజా వ్యక్తిత్వం అలాంటిది. ఆమెను ఇప్పుడు విమర్శించే వాళ్ళ వ్యక్తిత్వానికే వదిలేద్దాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం వాళ్ళు. 
 

66
Roja Selvamani

రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు. వ్యక్తులే ముఖ్యం.. అని రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. రాకింగ్ రాకేష్ వివాహం రోజా దగ్గరుండి తిరుమలలో చేసింది. రోజా ఇంటికి రాకింగ్ రాకేష్ దంపతులు తరచుగా వెళుతుంటారు. 
 

click me!

Recommended Stories