మహేష్ కి ఆ పొలిటికల్ పార్టీ అంటే పిచ్చి... సీఎం అవుతాడని ముందే చెప్పాడా?

First Published Jun 26, 2024, 2:40 PM IST

మహేష్ బాబు రాజకీయాల పట్ల ఎన్నడూ ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే ఓ రాజకీయ పార్టీ అంటే ఆయనకు ఇష్టం అట. ఓ నేత సీఎం అవుతాడని ముందే చెప్పాడట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం
 

Mahesh Babu


హీరో మహేష్ బాబు సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఏ విషయం మీద అగ్రెసివ్ గా మాట్లాడిన సందర్భం లేదు. ఇక రాజకీయాలు అయితే సరేసరి. మహేష్ బాబు ఓపెన్ గా ఒక రాజకీయ పార్టీని, లీడర్ ని సపోర్ట్ చేసింది లేదు. కానీ మహేష్ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. 
 

Krishna with ysr


ఒకప్పుడు ఎన్టీఆర్-కృష్ణకు అసలు పడేది కాదు. టీడీపీ పార్టీని, ఎన్టీఆర్ నాయకత్వాన్ని కృష్ణ వ్యతిరేకించారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ కృష్ణను రాజకీయాల్లో ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచి ఒకసారి పార్లమెంట్ కి వెళ్ళాడు కృష్ణ. రెండోసారి పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యాడు. 

Latest Videos


Mahesh Babu

వయసు పెరిగే కొద్ది కృష్ణ రాజకీయాలకు దూరం అయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల కృష్ణ ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. వైఎస్ఆర్ సైతం కృష్ణ అంటే గౌరవం చూపించేవారు. 
 

Krishna Birth Anniversary


మరి మహేష్ కి ఏ పొలిటికల్ పార్టీ ఇష్టం? ఆయన అసలు రాజకీయాల గురించి మాట్లాడతారా? అనే సందేహాలు ఉన్నాయి. మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు ఓ సందర్భంలో ఈ విషయం పై స్పందించారు. ఆయన మాటలను బట్టి చూస్తే మహేష్ బాబుకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. తండ్రి కృష్ణ పని చేసిన పార్టీ కావడంతో పాటు మహేష్ కాంగ్రెస్ పట్ల ఇష్టం కలిగి ఉన్నారట. 
 

మహేష్ రాజకీయాలను గమనిస్తూ ఉంటాడట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెలుపును మహేష్ ముందుగానే అంచనా వేశాడట. రేవంత్ స్పీచ్ లను చూసి ఈసారి కాంగ్రెస్ తెలంగాణాలో వచ్చే సూచనలు ఉన్నాయని అన్నాడట. ఈ విషయాన్ని మహేష్ బాబాయ్ ఓ సందర్భంలో అన్నారు. అలాగే భవిష్యత్తులో మహేష్ రాజకీయాల్లో రావచ్చు. ఏం జరుగుతుందో చెప్పలేం కదా అన్నారు. 

కాబట్టి మహేష్ బాబు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి సినిమాలతో ఆయన బిజీ. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న రాజమౌళి చిత్రం కోసం ఆయన సిద్ధం అవుతున్నారు. మేకోవర్ రాబడుతున్నాడు. ఎస్ఎస్ఎంబి 29 కోసం మహేష్ బాబు జుట్టు పెంచారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. దాదాపు రూ. 800 కోట్ల వ్యయంతో భారీగా తెరకెక్కించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ వరల్డ్ మూవీగా నిర్మించనున్నారు. రాజమౌళి, మహేష్ మొదటిసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిశారు. 

click me!