ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రముఖ నటి, ఒకప్పటి మిస్ ఇండియా ఈషా గుప్తా పాల్గొన్నారు. కాషాయ దుస్తులు ధరించి ప్రయాగరాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో ప్రత్యక్షమయ్యారు ఈషా. గంగా, యమునా, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.