బాలీవుడ్ నటి ఈషా గుప్తా, టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మధ్య గతంలో డేటింగ్ సంబంధం ఉందన్న వార్తలుజోరుగా వినిపించాయి. హార్దిక్ పాండ్య ఆ తర్వాత నటాషా స్టాంకోవిక్ ని వివాహం చేసుకున్నాడు. గతేడాది వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈషా గుప్తా హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై ఓపెన్ గా కామెంట్స్ చేసింది. తమ మధ్య రిలేషన్ గతంలో ఉండేదని అంగీకరించింది.
25
హార్దిక్ పాండ్యతో రిలేషన్ నిజమే, కానీ
ఈషా మాట్లాడుతూ, “ఆ సమయంలో మేము కొంత కాలం మాట్లాడుకున్నాం. అది డేటింగ్ అని చెప్పలేం. కానీ ఒక దశలో మేమిద్దరం నిజంగా డేటింగ్ ప్రారంభించాలని అనుకున్నాం. కానీ మేము డేటింగ్ దశకు చేరకముందే అంతా ముగిసిపోయింది. మేమిద్దరం రెండుమూడు సార్లు కలిశాం అంతే. మా మధ్య ఏ రకమైన గొడవలు లేవు, నెగటివిటీ లేదు. కానీ మా ఇద్దరి రిలేషన్ ముందుకు సాగలేదు. మా ఇద్దరి మధ్య బంధానికి రాసిపెట్టి లేదు అని అనుకున్నా. కేవలం రెండు నెలలకే మేము విడిపోయాం అని ఈషా పేర్కొంది.
35
నటాషాతో హార్దిక్ విడాకులు
ఈషా, హార్దిక్ వ్యవహారం కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన. ఆ తర్వాత హార్దిక్ నటాషా ని పెళ్లి చేసుకోవడం, విడిపోవడం జరిగింది. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.ఈషా గుప్తా 2019లో హార్దిక్ పాండ్యా ‘కాఫీ విత్ కరణ్’ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు చేసిన కొద్ది మంది సెలబ్రిటీల్లో ఒకరు. అయితే ఆ సమయంలో తాను హార్దిక్‌తో టచ్‌లో లేకపోవడంతో అది తనపై ప్రభావం చూపలేదని ఆమె తెలిపింది.
నటిగా ఈషా గుప్తా చివరిసారి ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన ఏక్ బద్నామ్ ఆశ్రమ్ 3 లో బాబీ డియోల్ సరసన నటించారు. అలాగే, ఆమె వన్ డే జస్టిస్ డెలివర్డ్ సినిమాలో డీసీపీ లక్ష్మీ రాథీ పాత్రలో కనిపించారు.ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మరోసారి హార్దిక్ పాండ్యాతో సంబంధిత పర్సనల్ లైఫ్ వ్యవహారాలు హైలైట్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం 39 ఏళ్ళ వయసున్న ఈషా గుప్తా స్పెయిన్ కి చెందిన వ్యాపారవేత్త తో డేటింగ్ చేస్తోంది. ఆమె తెలుగులో రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
55
ఫోటో షూట్స్ తో పాపులారిటీ
ఈషా గుప్తా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. కొన్నిసార్లు ఆమె ఫోటో షూట్స్ శృతి మించడం వల్ల ట్రోలింగ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈషా గుప్తా దేశీ మ్యాజిక్ అనే చిత్రంలో నటిస్తోంది.