విలన్ అవతారమెత్తిన సీరియల్ కిస్సర్, పవన్ కళ్యాణ్ తో యుద్ధం చేయబోతున్న రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా?

Published : Sep 16, 2025, 02:46 PM IST

ముద్దు సీన్ లేనిదే సినిమాలో నటించను అని చెప్పిన స్టార్ హీరో, రొమాంటిక్ ఇమేజ్ నుంచి విలన్ అవతారం ఎత్తబోతున్న నటుడు ఎవరో తెలుసా? త్వరలో  పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్న హీరో ఎవరు? 

PREV
15
సీరియల్ కిస్సర్‌ గా

సీరియల్ కిస్సర్‌గా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు విలన్ అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. "ముద్దు సీన్ లేకపోతే నటించను" అనే కామెంట్‌తో ఒకప్పుడు వార్తల్లో నిలిచిన ఈ నటుడు, ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిన ఈ స్టార్ హీరో, రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలతో భారీ హీరోల సినిమాల్లో తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు.

25
మర్డర్ మూవీతో క్రేజ్

2004లో విడుదలైన మర్డర్ మూవీతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఇమ్రాన్ హష్మీ, ఆ తరవాత వరుసగా హిట్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించాడు. రొమాంటిక్ జానర్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అతడు, "సీరియల్ కిస్సర్" అనే బిరుదును కూడా సంపాదించాడు. అయితే కాలక్రమంలో అతడి సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవటంతో కొంతకాలం వెనకబడిపోయాడు.

35
OG లో విలన్ గా ఇమ్రాన్

ఇప్పుడు మాత్రం కొత్త హంగులతో, నటనలో కొత్త కోణాన్ని చూపిస్తూ విలన్ పాత్రల్లో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "OG" సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఇమ్రాన్ హష్మీ పాత్ర గురించి ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగిపోతుంది.

45
ఇమ్రాన్ హష్మీ వ్యక్తిగత జీవితం

సినిమా కెరీర్ ఎలా ఉన్నా.. ఇమ్రాన్ హష్మీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా హ్యాపీగా గడిచిపోతోంది. తన హైస్కూల్ ఫ్రెండ్ పర్వీన్ షహానీని ప్రేమించి, ఆమెను 2006లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అయాన్ హష్మీ అనే కొడుకు ఉన్నాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇమ్రాన్ హష్మీ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్‌లు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నాడు.

55
టాలీవుడ్ లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు

తెలుగు సినిమాల్లో ఇప్పుడు బాలీవుడ్ నటులకు మంచి డిమాండ్ ఉన్న సందర్భంలో ఇమ్రాన్ హష్మీ లాంటి నటుడు OG చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమాకు బాలీవుడ్ లో ఇమ్రాన్ ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి చూడాలి ఓజీ రిజెల్ట్ ఎలా ఉంటుందో.

Read more Photos on
click me!

Recommended Stories