తాజాగా ఓ షోలో వీరిద్దరు కనిపించారు. వర్ష, ఇమ్మాన్యుయేల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో చెప్పారు. వర్ష మాత్రం ఈ ఏడాది తనకు అస్సలు బాలేదన్నారు. 2024 లాంటి ఏడాది ఇంకోటి అసలు వద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది.
నా జీవితంలో 2024 లాంటి సంవత్సవరం మళ్లీ ఎప్పటికి చూడకూడదు అనుకుంటున్నా అంది. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమ్మానుయేల్‌కి ఒకసారి కాదు.. లెక్క లేనన్ని సార్లు గొడవలు జరిగాయి.