హోటల్‌ రూమ్ లో శవమై కనిపించిన నటుడు, ప్రైమరీ రిపోర్ట్ ఏంటంటే?

Published : Dec 29, 2024, 07:29 PM IST

ప్రముఖ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో మృతి చెందారు. ఈ ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. ప్రాథమిక రిపోర్ట్ లో పోలీసులు చెప్పిన విషయం ఇదే. 

PREV
15
హోటల్‌ రూమ్ లో శవమై కనిపించిన నటుడు, ప్రైమరీ రిపోర్ట్ ఏంటంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ సినీ, సీరియల్ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందారు. మలయాళ సినీ, సీరియల్స్ తో బాగా పాపులర్ అయిన దిలీప్ శంకర్ మరణం చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చింది. కేవలం 2 రోజుల క్రితం హోటల్ రూమ్ బుక్ చేసుకున్న దిలీప్ శంకర్ ఇప్పుడు మృతి చెందారు. దిలీప్ శంకర్ మరణంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

25

తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న దిలీప్ శంకర్ 2 రోజుల క్రితం చెక్ ఇన్ చేశారు. ఆ తర్వాత దిలీప్ శంకర్ కనిపించకుండా పోయారు. ఎవరికీ కనిపించలేదు. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఈ ఘటన  వెలుగులోకి వచ్చింది. 

35

హోటల్ గదిలో నేలపై దిలీప్ శంకర్ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం దిలీప్ శంకర్ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపారు.

45

దిలీప్ శంకర్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే, ఆ ఆరోగ్య సమస్యలు ప్రాణాంతకం కాదని స్పష్టం చేశారు. దిలీప్ శంకర్ ఆరోగ్య సమస్య కారణంతోనా, లేక హార్ట్ ఎటాక్‌ వచ్చిందా?  మరే ఇతర కారణాల వల్ల మృతి చెందారా అనేది పోస్ట్‌మార్టం నివేదికలో తేలనుందని పోలీసులు వెల్లడించారు.

55

రెండు సినిమాలు, పలు సీరియల్స్ లో ప్రేక్షకుల మన్ననలు పొందిన దిలీప్ శంకర్ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు. తన కెరీర్‌లో మంచి గౌరవాన్ని సంపాదించుకున్న దిలీప్ శంకర్ మరణం మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories