ఇమ్మాన్యుయెల్‌ హార్ట్ బ్రేక్‌ చేసిన తనూజ.. దెబ్బకి డీమాన్‌ పవన్‌కి ఫ్యూజుల్‌ ఔట్‌

Published : Dec 01, 2025, 08:37 PM IST

సోమవారం వచ్చిందంటే నామినేషన్ల ప్రక్రియతో హౌజ్‌ హీటెక్కిపోతుంది. తాజాగా ఈ సోమవారం తనూజ, ఇమ్మాన్యుయెల్‌ మధ్య నామినేషన్ల ప్రక్రియ ఎమోషనల్‌గా అనిపించింది. అయితే తనూజ ఇచ్చిన ట్విస్ట్ కి పవన్‌ కి మతిపోయింది. 

PREV
16
బిగ్‌ బాస్‌ హౌజ్‌ని హీటెక్కించిన 13వ వారం నామినేషన్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇంకా మూడు వారాలే ఉంది. షో దగ్గరపడే కొద్ది ఉత్కంఠగా మారుతుంది. ఆసక్తి పెరుగుతుంది. ఇన్నాళ్లు బాండింగ్‌ని మెయింటేన్‌ చేసిన వారంతా ఇప్పుడు ఆ బాండింగ్‌ నుంచి బయట పడాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో భాగంగా ఈ ఆదివారం దివ్య ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో భరణి, దివ్య బాండ్‌ బ్రేక్‌ అయ్యింది. మరోవైపు రీతూ, డీమాన్‌ పవన్‌ ల బాండ్‌ని బ్రేక్‌ చేసేందుకు ఇతర కంటెస్టెంట్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇమ్మాన్యుయెల్‌తో, తనూజ బాండింగ్‌లో ఇమ్మూ హార్ట్ బ్రేక్‌ అయ్యిందట. 

26
వాడితోనే షేర్‌ చేసుకున్నా

సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందనే విషయం తెలిసిందే. మిగిలిన రోజుల్లో స్నేహంగా ఉన్న వారంతా ఈ నామినేషన్ల విషయంలోనే ఫైర్‌ అవుతారు. దీంతో హౌజ్‌ మొత్తం హీటెక్కుతుంది. అందులో భాగంగా ఈ సోమవారం ఎపిసోడ్‌ ప్రోమోలు విడుదలయ్యాయి. ఇందులో ఇమ్మాన్యుయెల్‌, తనూజల మధ్య చర్చ ఎమోషనల్‌గా సాగింది. తనూజ తన నామినేషన్‌ పాయింట్‌కి వచ్చినప్పుడు ఇమ్మాన్యుయెల్‌ పేరు చెప్పింది. `నాకు ఏమైనా అనిపిస్తే, నా మైండ్‌లో ఏమైనా తిరుగుతుంటే దాన్ని షేర్‌ చేసుకోవాలి. వాడితోనే చెప్పుకున్నా. ఎందుకంటే వాడేగా నా ఫ్రెండ్‌` అని చెప్పింది తనూజ. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్‌ అయ్యింది.

36
అదే నన్ను హర్ట్ చేసింది

దీనికి ఇమ్మాన్యుయెల్‌ రియాక్ట్ అయ్యాడు. నువ్వెంత నిజాయితీగా ఉన్నావో, నీ విషయంలో నేను కూడా అంతే నిజాయితీగా ఉన్నాను. అది నీకు ఎందుకు తెలియలేదో, అదే నన్ను హర్ట్ చేసింది. నువ్వేమో నా ఫ్రెండే కాదురా అని నా మొహం మీదే అన్నావ్‌. తనూజ నువ్వు నన్ను ఏమైనా అంటే దాన్నుంచి బయటకు రావడానికి టైమ్‌ పడుతుంది, ప్లీజ్‌ గొడవలొద్దు అనే చెప్పాను` అని ఇమ్మాన్యుయెల్‌ ఎమోషనల్‌ అయ్యాడు. దీనికి తనూజ మళ్లీ స్పందిస్తూ, ఇప్పటికీ చెబుతున్నా, నువ్వు నా ఫ్రెండే` అని.

46
తనూజ ఇచ్చిన ట్విస్ట్ కి పవన్‌ ఫ్యూజులు ఔట్‌

కట్‌ చేస్తే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది తనూజ. నా ఫస్ట్ నామినేషన్‌ డీమాన్‌ పవన్‌ అని తెలిపింది. దీంతో పవన్‌ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పటి వరకు జోక్‌ చేశారా? అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఇమ్మాన్యుయెల్‌తో వాదించిన తనూజ.. ఆయన్ని కాకుండా పవన్‌ నా ఫస్ట్ నామినేషన్‌ అని చెప్పడంతో అక్కడ పవన్‌కే కాదు, అక్కడ ఉన్న వారందరికీ మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. పవన్‌ కామెంట్‌కి ఘాటుగా రియాక్ట్ అయ్యింది తనూజ, జోకా గీకా అనేది బిగ్‌ బాస్‌ చెబుతాడు, నువ్వు కాదంటూ ఆయనకు కౌంటర్‌ ఇవ్వగా, నాకు జోక్‌ అనిపించిందన్నారు పవన్‌. దీనికి నవ్వు అంటూ ఆమె సెటైర్లు వేసింది.

56
టీమ్‌ కోసం కాదు రీతూ కోసం ఆడావు

గేమ్‌ ఆడింది టీమ్‌ కోసం కాదు, ఒక మనిషి కోసం ఆడావు అని తనూజ అనగా, ఈ హౌజ్‌లో నాకు ఫస్ట్ కెప్టెన్‌గా చూడాలనుకున్నది అప్పటి వరకు అవ్వలేని రీతూ` అని పవన్‌ చెప్పగా, టీమ్‌ కోసం ఆడలేదా అని తనూజ అడగ్గా, అవును అని సమాధానం ఇచ్చాడు పవన్‌. నేను టీమ్‌కి సపోర్ట్ చేయను, రీతూకి సపోర్ట్ చేస్తానని వెళితే, మాకు ప్రాబ్లమ్‌ అవుతుంది కాబట్టి అలా ఆడావు అని తనూజ చెప్పగా, మధ్యలో రీతూ కల్పించుకుంది. 

66
వాడు నాకేమైనా డబ్బులిచ్చాడా?

రీతూ.. తనూజకి కౌంటర్‌ ఇస్తూ దొంగల టాస్క్ లో వాడు వేరుగానే ఉన్నాడు, వాడేమైనా నాకు డబ్బులిచ్చాడా? అని రీతూ కౌంటర్‌ ఇచ్చింది. గేమ్‌ ఆడకుండానే ఇక్కడ ఉన్నానా అంటూ ఆమె చెప్పింది. టీమ్‌ అంటే టీమ్‌ కోసమే ఆడతానని పవన్‌ చెప్పగా, నీ కోసం నువ్వు ఆడు అని తనూజ చెప్పింది. మొత్తంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ చాలా వాడివేడిగా జరిగిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories