Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం

Published : Dec 18, 2025, 12:24 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9లో ఇక టాప్‌ 5 కంటెస్టెంట్ల జర్నీ చూపిస్తున్నారు బిగ్‌ బాస్‌. మొదటగా ఇమ్మాన్యుయెల్‌ జర్నీ చూపించగా, ఆయన జర్నీ ఆద్యంతం ఎమోషనల్‌గా అనిపించింది.  

PREV
16
నవ్వులు పూయిస్తోన్న ఇమ్మాన్యుయెల్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్‌ జరగబోతుంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్ లతో అలరిస్తున్నారు. బిగ్ బాస్‌ కూడా ఎంటర్‌టైన్‌లు చేసే టాస్క్ లు ఇస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్‌లో ఓ టాస్క్ తోపాటు ఇమ్మాన్యుయెల్‌ చేత జాతకం చెప్పించారు. అనంతరం ఇమ్మాన్యుయెల్‌ సక్సెస్‌ జర్నీని చూపించారు. చివరి వారంలో టాప్‌ 5 కంటెస్టెంట్ల అల్టిమేట్‌ జర్నీని చూపిస్తారు. బిగ్‌ బాస్‌ వారిని కీర్తిస్తారు. గొప్పగా చెబుతారు. అందులో భాగంగా మొదటగా ఇమ్మాన్యుయెల్‌ గురించి చెప్పారు.

26
సంజనా చెల్లి సర్‌ప్రైజ్‌ వీడియో

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో మొదట బాల్‌ అంటించే టాస్క్ ఇచ్చారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది డే లో భాగంగా సంజనాని విన్నర్‌గా ప్రకటించారు. ఆమెకి ఇంటి నుంచి సందేశం వచ్చింది. సంజనా చెల్లి నిక్కీ గల్రానీ తన సందేశాన్ని పంపించింది. మూడు వారాల్లోనే వస్తావనుకున్నాం. ఇన్ని రోజులు ఉంటావని భావించలేదని తెలిపింది. చాలా బాగా గేమ్‌ ఆడుతున్నావని చెప్పింది. ఇమ్మాన్యుయెల్‌ని బాగా చూసుకోవాలని చెప్పింది. కప్‌ తో రావాలని వెల్లడించింద. ఆమెకి కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది నిక్కీ.

36
ఇమ్మాన్యుయెల్‌ జాతకాలు

ఇక అనంతరం బిగ్‌ బాస్‌ ఇమ్మాన్యుయెల్‌కి సరదా నవ్వులు టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆయన ఇతర కంటెస్టెంట్ల జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. పవన్‌ గురించి చెబుతూ, రేఖలు అరిగిపోయాయని నవ్వులు పూయించాడు. రీతూ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె వెళ్లిపోయాక లైఫ్‌ మారిపోయిందన్నాడు. తనూజకి పెళ్లి రేఖ ఉందని, వచ్చేవాడు మంచి వాడు అని, సిక్స్ ప్యాక్‌ ఉండదని, జుట్టు ఉండదని, కానీ చాలా మంచి వాడు అని చెప్పాడు. సంజనా పరువు తీశాడు. ఆమె మూడో వారంలో వెళ్లాల్సి వచ్చిందని, లక్కీగా బతిపోయిందని తెలిపారు. అలాగే గుడ్ల దొంగతనం గురించి చెప్పాడు. తన భర్త ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్నాడని, నువ్వు వెళ్లాక ఆయనకు నరకమే అని తెలిపారు. కళ్యాణ్‌ గురించి చెబుతూ, రేఖలే లేవని, అసలు చేయే లేదని చెప్పి నవ్వులు పూయించారు. ఆ తర్వాత అందరు కలిసి ఇమ్మాన్యుయెల జాతకం చెప్పడం విశేషం.

46
జర్నీచూసుకుని ఎమోషనల్‌ అయిన ఆమ్మాన్యుయెల్‌

అనంతరం ఇక ఇమ్మాన్యుయెల్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతూ, బిగ్‌ బాస్‌ జర్నీని చూపించారు. ఇమ్మూగురించి చెప్పగా చెప్పారు. ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా, ఆసక్తిగా మారుతుంది. బాధ, నిరాశ, ఓటమి అనే ఎమోషన్స్ నుంచి మనిషి తప్పించుకోవాలని చూస్తారు, కానీ అధి సాధ్యం కాదు, వాటిని మర్చిపోయే ఎమోషన్‌ ఆనందం. దానికి తన, మన అనే భేదాలు లేవు, అందరిని ఎంటర్‌టైన్‌ చేసేవారిని దేవుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు. అన్ని లభిస్తుంటాయి. చిన్పప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్లకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తోంది. 

56
ఇమ్మూ జర్నీ అద్భుతం.

ఈ ఇంట్లో మీరు బలంగా ముందుకు సాగారు. మాటలనే ఆయుధాలుగా మల్చుకున్నారు. తెలివితేటలే మీ గేమ ప్లాన్‌. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విషయంలో ఈ హౌజ్‌లో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ మంచి వైపునిలిచారు. ప్రతిభకి, చదువు, జుట్టు, ఆడంభరాలు అవసరం లేదని చాటి చెప్పినట్టు తెలిపారు. కమెడియన్‌గా ఇంట్లోకి అడుగుపెట్టి, హీరోగా బయటకు రావాలనేమీ అమ్మ కోరికని నిజం చేశారు` అని తెలిపారు బిగ్‌ బాస్‌. ఇమ్మూ లేకపోతే హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదనేలా తెలిపారు బిగ్‌ బాస్‌.

66
కట్టేకాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా

ఈసందర్భంగా ఆయన జర్నీని తెలిపే ఏవీని చూపించారు. ఇది చూసి ఎమోషనల్‌ అయ్యారు ఇమ్మాన్యుయెల్‌. తాను ఇక్కడి వరకు వస్తానని అస్సలు అనుకోలేదని, ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని ఇలానే ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటానని, నవ్విస్తానని, ఇలానే నన్ను ప్రోత్సహిస్తే, కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తానని తెలిపాడు ఇమ్మూ. వంద ఆలోచనలతో బిగ్ బాస్‌ షోకి వచ్చిన తనకు ఆ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సెపరేట్‌గా డెకరేట్‌ చేయించిన గార్డెన్‌లో ఫోటోలు చూసుకుని ఎమోషనల్‌ అయ్యాడు ఇమ్మాన్యుయెల్‌. ముఖ్యంగా అమ్మతో దిగిన ఫోటోని చూసి సంబరపడ్డాడు. వాటిని తీసుకొని హౌజ్‌లోకి వెళ్లాడు. ఇమ్మూ జర్నీ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories