Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. అందులోనూ మరో అదిరిపోయే ట్విస్ట్ ఉందని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత చాలా మారిపోయింది. అసలైన రచ్చ ఇప్పుడు నడుస్తోంది. ఇందులో దివ్వెల మాధురీ రెచ్చిపోతుంది. ఇతర కంటెస్టెంట్లకి కౌంటర్లిస్తూ దుమ్మురేపుతుంది. మరోవైపు రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్, సంజనా, సుమన్ శెట్టి వంటి వాళ్లు కూడా తమదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంలో హడావుడి చేసిన రమ్య ఇప్పుడు డల్ అయ్యింది. అలాగే ఆయేషా జీనత్ కూడా రెచ్చిపోతుంది. ఓ వైపు వాళ్లు చేసే హడావుడి ఒక రేంజ్‌లో ఉంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ లు వేరే లెవల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఇద్దరు మాజీ కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపించారు. అర్జున్, అమర్ దీప్ పోలీసులుగా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తున్నారు.
24
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ రీఎంట్రీ
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. హౌజ్‌లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ తెలుగు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. భరణి, ఫ్లోరా, ప్రియా, మర్యాద మనీష్, హరీష్, శ్రష్టి వర్మ, శ్రీజ ఎలిమినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరిలో ఆరుగురు కంటెస్టెంట్లని మళ్లీ బ్యాక్ తీసుకురాబోతున్నారట బిగ్ బాస్. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. మరి ఎందుకు బ్యాక్ తీసుకురాబోతున్నారు? ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
34
వచ్చే వారం నామినేట్ చేసేది వాళ్లే
ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో మర్యాద మనీష్ తప్ప, భరణి, శ్రీజ, ప్రియా, శ్రష్టి వర్మ, హరీష్‌లను మళ్లీ హౌజ్‌లోకి పంపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ వారం వీళ్లే కంటెస్టెంట్లని నామినేట్ చేస్తారట. వచ్చే వారానికి సంబంధించి నామినేషన్ ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే వీరిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందట. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లని అందులోనే ఉంచబోతున్నారట. దానికంటూ ఓ ప్రాసెస్ ఉంటుందని సమాచారం. అదేంటో ఆదివారం ఎపిసోడ్‌లో చెప్పనున్నట్టు టాక్. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
సాధారణంగా ఎలిమినేషన్‌కి సంబంధించి సోమవారం నిర్వహించే నామినేషన్ల ప్రక్రియని కంటెస్టెంట్లే చేస్తారు. అందరు కంటెస్టెంట్లు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తారు. వచ్చిన నామినేషన్లని బట్టి బిగ్ బాస్ ఫైనల్‌గా ఎవరు నామినేట్ అయ్యారో చెబుతారు. కానీ ఈ సారి అంతా రివర్స్ జరుగుతుంది. ట్విస్ట్ లతో నడుస్తోంది. నామినేషన్ కోసం సెపరేట్ టాస్క్ లు కూడా ఇస్తున్నారు బిగ్ బాస్. దీంతో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే వింతగా ఉందంటే, ఇప్పుడు మరో వింత క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.