కొన్ని సినిమాలు చరిత్రలో అలా నిలిచిపోతాయి. మరికొన్ని సినిమాలు కొత్త చరిత్రను రాస్తాయి. ఆ కోవలేకే వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. సౌత్ స్టార్ హీరోకు బాలీవుడ్ లో బ్రహ్మరథం పట్టిన మూవీ ఏది?
ఒక సౌత్ స్టార్ హీరో.. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ మీద దండయాత్ర చేసిన సినిమా. చాలా చిన్న బడ్జెట్ తో.. భారీ విజయం సాధించిన సినిమా, అంచనాలు లేకపోయినా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా. మొదట్లో ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తి చూపించలేదట. కానీ రిలీజ్ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు ఏక్ దూజే కేలియే.
25
కమల్ హాసన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ..
కమల్ హాసన్ హీరోగా.. తొలిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సినిమా ఏక్ దూజే కేలియే. ఈ సినిమా 1981లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా.. సైలెంట్ గా వచ్చి.. బాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చిందీ సినిమా. అంతే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈసినిమా ప్రత్యేకత ఏంటంటే.. కె బాలచందర్ ఈసినిమాను డైరెక్టర్ చేశారు. సౌత్ నుంచి బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టిన ఫస్ట్ కాంబో ఇదే.
35
10 లక్షలు పెడితే 10 కోట్ల వసూలు చేసింది..
ఈ సినిమా కేవలం రూ.10 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకుంది. ఆ కాలంలో ఇది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, ఏక్ దూజే కేలియే సినిమా దాదాపు నాలుగేళ్లపాటు నాన్ స్టాప్ గా కొన్ని థియేటర్లలో నడిచినట్టు సమాచారం. ఈరకంగా ఈమూవీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన రతి అగ్నిహోత్రి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నటుడు రాకేష్ బేడి కీలక పాత్ర పోషించారు. తాజాగా మ్యాషబుల్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత క్లైమాక్స్‌ను మార్చాలని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయని ఆయన తెలిపారు. సినిమాలో హీరో, హీరోయిన్ మరణించడం క్లైమాక్స్. అయితే ఇది మార్చేయాలని ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు మరణించడం కాదు.. కలవాలని డిమాండ్ కూడా చేశారు.
55
చంపేస్తాం... అని బెదిరించారు.
రాకేష్ బేడీ మాట్లాడుతూ, ప్రేక్షకులు తన పాత్రను చాలా సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. “మేము నిన్ను చంపేస్తాం.. నువ్వే ఆ ఇద్దరినీ చంపించావు” అంటూ తనకు బెదిరింపు లేటర్స్ వచ్చేవన్నారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.‘ఏక్ దుజే కే లియే’ చిత్రం కమల్ హాసన్ బాలీవుడ్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన సినిమాగా ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది. ప్రేమకథా చిత్రాల చరిత్రలో ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది.