Karthika Deepam 2 Today Episode (మే 27వ తేదీ)లో కార్తీక్ ని అందరి ముందు దోషిలా నిలబెట్టిన జ్యో. ఉగ్రరూపం దాల్చిన శివన్నారాయణ. కార్తీక్ చెంప చెల్లుమనిపించిన తాత. కార్తీక్ ని ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. నాకేదో భయంగా ఉందని అంటుంది దీప. మన తాత దక్షిణామూర్తి తాతకు బ్లెడ్ ఇచ్చినట్లు నీకు, నాకు, మా నాన్నకు, దక్షిణామూర్తి తాతకు తప్పా ఇంకా ఎవరికి తెలియదు. నువ్వు భయపడకు అంటాడు కార్తీక్. గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే కూర్చొని వీళ్ల కోసం ఎదురుచూస్తుంటారు.
26
జ్యోత్స్న కొత్త ప్లాన్
మీరు ఈ రోజు చేసిన గొప్ప పని గురించి తాత చెప్పాడు. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంటుంది జ్యోత్స్న. మేము చేసింది ఏం లేదు... తాత బ్లెడ్ ఇవ్వకపోయి ఉంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదని చెప్తాడు కార్తీక్. ఏ పాజిటివ్ రక్తం కావాలి అని అడిగారు. నాది కూడా అదే కాబట్టి ఇచ్చాను. అయినా రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటాడు శివన్నారాయణ. మరి ఎవరికి రక్తం దానం చేశావో కూడా చూడాల్సింది తాత అంటుంది జ్యోత్స్న.
36
చిచ్చు పెట్టిన జ్యో
ఆ తర్వాత సుమిత్రతో మమ్మీ నువ్వు తాతకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటుంది జ్యోత్స్న. ఎవరినో కాపాడితే మీ మమ్మీ మీ తాతకు ఎందుకు రుణపడాలి అంటుంది పారు. కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కదా గ్రానీ అని బాంబ్ పేలుస్తుంది జ్యోత్న్స. మనం దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్దాం పదా తాత అంటుంది జ్యోత్స్న. వాడిపేరు ఎందుకు తలుస్తున్నావు అని ఆవేశంతో ఊగిపోతాడు శివన్నారాయణ.
శత్రువుకు సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు తాత అంటుంది జ్యోత్స్న. అంతకంటే ముందు నేను చస్తే మేలు అనుకుంటాను అంటాడు శివన్నారాయణ. ఎవరైనా నీకు తెలియకుండా నీతో ఆ పని చేయిస్తే అని అడుగుతుంది జ్యోత్స్న. చెప్పుతో కొడతాను అంటాడు శివన్నారాయణ. అయితే కొట్టు నీ మనుమడిని అని అంటుంది జ్యోత్స్న. అంతా షాక్ అవుతారు.
అదేంటి అని అడిగితే హాస్పిటల్లో జరిగిన విషయాన్ని అందరితో చెప్తుంది జ్యోత్స్న. షాక్ అవుతారు అంతా. శివన్నారాయణ. కార్తీక్ దగ్గరకు వచ్చి జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. కార్తీక్ నిజమే అని చెప్పడంతో లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. వాడు నా శత్రువు అని తెలిసి కూడా వాడి ప్రాణాలు కాపాడేలా చేశావు. క్షమించలేని తప్పు చేశావు.. ఇక్కడి నుంచి వెళ్లిపోరా అని గెంటెస్తాడు శివన్నారాయణ. ఇప్పుడు నీకు హాయిగా ఉందా అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. నిజం తెలిసినా మీలా చాటుగా చెప్పుకొని సైలెంట్ గా ఉండాలా అని కాంచన, శ్రీధర్ లను కూడా ఇరికిస్తుంది జ్యోత్స్న.
56
కార్తీక్ ఎమోషనల్
ఇక ఆపుతావా అని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు కార్తీక్. తర్వాత తాత దగ్గరకు వెళ్లి చిన్నప్పటి నుంచి నువ్వు ఏం నేర్పించావో ఆ ధర్మాన్నే నేను పాటిస్తున్నా. ప్రాణం ఎవరిదైనా సరే కాపాడాలని చెప్పావ్. నేను అలాగే చేశాను. నీ శత్రువు కిరాతకుడే కావచ్చు. కానీ నువ్వు కాదు. నీకు మనిషి విలువ తెలుసు. కొన ఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే ప్రాణం పోయాలని నువ్వు నేర్పించిన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు కార్తీక్.
66
నువ్వు గొప్పోడివి తాత
నువ్వు ఎన్ని మెట్లు దిగజారి నన్ను కొట్టావో ఆలోచించు. నీ కళ్ల ముందు ఓ ప్రాణం పోతుంటే వాళ్లలో నువ్వు మనిషిని చూస్తావా? లేక శత్రువును చూస్తావా? అని శివన్నారాయణను నిలదీస్తాడు కార్తీక్. నువ్వు బ్లెడ్ ఇచ్చేది దక్షిణమూర్తి తాతకు అని తెలిసినా కూడా నువ్వు వెనక్కి వెళ్లేవాడివి కాదని నా నమ్మకం. ప్రాణం తీసేవాడికంటే ప్రాణం పోసేవాడే గొప్పోడు. అలా చూస్తే నువ్వు దక్షిణామూర్తి కంటే చాలా గొప్పోడివి తాత అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.