రిలేషన్‌షిప్‌లో ఈషారెబ్బాకి చేదు అనుభవాలు.. అందుకే పెళ్లికి దూరం.. రహస్యాలు బయటపెట్టిన హీరోయిన్‌

Published : May 19, 2024, 12:29 PM ISTUpdated : May 19, 2024, 05:43 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా రిలేషన్స్ గురించి ఓపెన్‌ అయ్యింది. తాను రాంగ్‌ రిలేషన్ షిప్స్ లో ఉన్నట్టు చెప్పింది. అంతేకాదు పెళ్లి గురించి షాకిచ్చే విషయాలను వెల్లడించింది.   

PREV
17
రిలేషన్‌షిప్‌లో ఈషారెబ్బాకి చేదు అనుభవాలు.. అందుకే పెళ్లికి దూరం.. రహస్యాలు బయటపెట్టిన  హీరోయిన్‌
Eesha Rebba

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా.. ఒకప్పుడు వరుస విజయాలు అందుకుని అందరిని ఆకట్టుకుంది. ఓ మోస్తారు బడ్జెట్‌ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కొందరు దర్శకులు అలాంటి ఆఫర్‌ చేసి తక్కువ చేసి చూపిస్తే, చాలా వరకు అసలు అలాంటి ఆఫర్లే తన వద్దకు రాలేదు. లేదంటే సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకే పరిమితం చేశారు. 
 

27
Eesha Rebba

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు చిన్న చూపు అనే నానుడి చాలా కాలంగా వినిపిస్తుంది. ముంబయి హీరోయిన్లని ఇంపోర్ట్ చేసుకుంటారని, తమకి అవకాశాలు ఇవ్వడం లేదని పలుసందర్భాల్లో వాపోయింది ఈషా రెబ్బా. అందుకే ఈ అమ్మడికి తెలుగులో అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. నటిగా మంచి నటనతో మెప్పిస్తుంది. పాత్రకి న్యాయం చేస్తుంది. గ్లామర్‌ పరంగానూ తాను రెడీనే అంటుంది. కానీ ఈ బ్యూటీకి ఎందుకో సరైన ఆఫర్లు రావడం లేదు. 
 

37

ఇదిలా ఉంటే ఈషా రెబ్బా తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించింది. తన రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ చెప్పింది. ఇండస్ట్రీలో హీరోయిన్లకి పెళ్లిళ్లు త్వరగా కావు ఎందుకు అనే ప్రశ్న యాంకర్‌ నుంచి రావడంతో ఈషా రెబ్బ.. చాలా ఓపెన్‌ అయ్యింది. తాను ఫేస్‌ చేసిన పరిస్థితులు, రిలేషన్స్ షిప్స్, పెళ్లి చేసుకోవడానికి సంబంధించి ఆమె రియాక్ట్ అయ్యింది. తన ఫాదర్‌ పెళ్లి చేసుకుంటానంటే మాట్యిమోనీలో తన ప్రొఫైల్‌ పెడతానన్నాడట. వినడానికి క్యూట్‌గా ఉంది, కానీ వర్కౌట్ కాదని చెప్పిందట ఈషా. 
 

47

అయితే ఉద్యోగంలో రెగ్యూలర్‌గా ఒకేలాంటి మనుషులను కలుస్తాం. వారు ఫ్రెండ్స్ అవుతారు. లాంగ్‌ రిలేషన్స్ మెయింటేన్‌ అవుతాయి. కానీ ఇండస్ట్రీలో అలా కాదని, రోజుకో కొత్త పర్సన్‌ కలుస్తారు, మాట్లాడతాం, రకరకాల చర్చలు జరుగుతాయి. రకరకాల పీపుల్స్ ని కలుస్తుంటాం. దీంతో ఎవరేంటి? ఇండస్ట్రీ ఏంటి అనేది ఓ అవగాహన ఉంటుంది. ఇండస్ట్రీలో అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టమని, అర్థం చేసుకోవడం, కలిసి ట్రావెల్‌ చేయడం, భరోసా ఇవ్వడం తక్కువగా ఉంటుందని తెలిపింది ఈషా రెబ్బా. 

57

ఈ సందర్బంగా రిలేషన్‌ షిప్‌ గురించి చెబుతూ, తాను రిలేషన్స్ లో లేనని చెబితే అది అబద్దమే అవుతుందని, తాను రిలేషన్స్ లో ఉన్నానని, కానీ అవి రాంగ్ రిలేషన్స్ అని చెప్పింది. తాను ఎవరినైనా తొందరగా నమ్మేస్తానని, కానీ ఆ తర్వాత వారితో ట్రావెల్‌ అయ్యే కొద్ది వారేంటి? బయట ఎలా ఉంటారు, మనతో ఎలా ఉంటారు, వారిలోని డిఫరెంట్‌ కలర్స్ కనిపిస్తాయని చెప్పింది. అంతేకాదు ఏది రాంగ్‌, ఏది రైట్‌ అనేది మనకు ముందే కొడుతుంటుందని, రెడ్‌ ఫ్లాగ్స్ కనిపిస్తూనే ఉంటాయని, కానీ వాటి నుంచి స్మూత్‌గా ఎస్కేప్‌ కావడం కష్టమని చెప్పింది. 

67

తన విషయంలోనూ అదే జరిగిందని, తాను రాంగ్‌ రిలేషన్స్ లో ఉన్నానని అందుకే అవన్నీ వదిలేసినట్టు చెప్పింది ఈషా రెబ్బా. విడిపోవడానికి చిన్న చిన్న సమస్యలే అయినా రిలేషన్స్ లో ఉన్నప్పుడు అవి పెద్దగా అనిపిస్తాయని, అవన్నీ బయటకు చెప్పలేమని తెలిపింది ఈషా రెబ్బా. తప బ్రేకప్‌లు హార్ష్ గానే జరిగాయని వెల్లడించింది. వారి గురించి అసలు విషయాలు తెలిశాక నెమ్మదిగా ఆలోచించుకుని బ్రేకప్‌లు చెప్పినట్టు తెలిపింది ఈషా. ఇండస్ట్రీలో ఉండటం వల్లే రిలేషన్‌ షిప్స్ ఫెయిల్యూర్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పింది.
 

77

ఈ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి గురించి చెబుతూ, తనకు పెళ్లి అంటే భయమని తెలిపింది. ఆ పదం వింటేనే భయమేస్తుందని వెల్లడించింది. అయితే పెళ్లి అంటే పెద్ద విషయమని తనతో కాదని, దాన్ని ఫేస్‌ చేయలేనని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన లేదని ఐడ్రీమ్‌ మీడియాతో తెలిపింది. ఇక ఈషారెబ్బా ఆ మధ్య `మాయా బజార్‌ ఫర్‌ సేల్‌`, `దయా` అనే వెబ్‌సిరీస్‌లో మెరిసింది. `దయా`లో ప్రెగ్నెంట్ ఉమెన్‌గా అదరగొట్టింది. ఇప్పుడుఆమె ఫోకస్‌ ఓటీటీపై ఉందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories