సుమ ప్రశ్నలు, పంచ్‌లు, కొన్ని ప్రశ్నలు, ఫన్నీ ఎలిమెంట్లతో ఈ షో సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులోనూ అదే జరిగింది. కానీ యాంకర్లని చూసి షోలో ఉండే కుర్రాళ్లు రెచ్చిపోయారు. వాళ్లతో పులిహోర కలిపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గీతా భగత్‌ని పట్టుకుని నువ్వు ఊ అను బేబీ వాడే కాదు, ఎవడు వచ్చినా మనల్ని ఆపలేరు అని ఓ కుర్రాడు అనగా, ఆవిడ అనాలి, ఎవరు అని కాదని గీతా చెప్పడంతో నవ్వులు విరిసాయి. తనకు జెండర్‌తో సంబంధం లేదని ఆ కుర్రాడు చెప్పడం మరింత నవ్వులు పూయించింది.