కరాటే కళ్యాణితో.. నటుడు చందు చివరి వాట్సప్ ఛాట్ వైరల్‌

Published : May 19, 2024, 10:02 AM IST

నేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు.

PREV
111
కరాటే కళ్యాణితో.. నటుడు చందు చివరి వాట్సప్ ఛాట్  వైరల్‌

గత మూడు రోజులుగా వరస ఊహించని సంఘటనలతో బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. త్రినయని సీరియల్ నటులు వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే అందుకు కారణం. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్ లో మరణించారు. ప్రేక్షకులు ఊహించని ఆ విషాదం నుంచి బయట పడేలోగా, అదే సీరియల్ లో న‌టించిన‌ చంద్ర కాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. 

211

ప‌విత్రా జ‌యరాం కారు ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు, అదే కారులో చందు కూడా ప్ర‌యాణించారన్న విషయం తెలిసిందే. స్వ‌ల్ప గాయాల‌తో ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే.. ఇదే ప్ర‌మాదంలో ప‌విత్ర మ‌ర‌ణించార‌న్న విష‌యాన్ని చందు త‌ట్టుకోలేని చందు సూసైడ్ చేసుకున్నారు. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 
 

311

 చంద్రకాంత్‌ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది.  తల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్‌ చాట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 
 

411

పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు. ఆ వాట్సప్ ఛాట్ లో ఏముంది అంటే...
 

511

నేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్‌. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్‌ చేశాడు. ఈ చాట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
 

611

నటి మృతిని ఆమె ప్రియుడు, నటుడు చందు జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో కన్నీరుమున్నీరుగా విలపించాడు. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నానంటూ తన చావును ముందుగానే హింటిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలలోనూ ఇంకో రెండు రోజులు మాత్రమే.. అంటూ పవిత్రతో కలిసున్న పిక్స్‌ షేర్‌ చేశాడు. చివరికి అన్నంత పనీ చేశాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం (మే 17న) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై నటుడి తల్లీభార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

711

చందు తల్లి మాట్లాడుతూ.. 'ఐదేళ్ల నుంచి చందు.. పవిత్రతోనే ఉంటున్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి తను భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. యాక్సిడెంట్‌ తర్వాత కూడా నా కొడుకు మాతో మాట్లాడలేదు. నా కోడలు, నేను చూడటానికి వెళ్తే దగ్గరకు కూడా రానివ్వలేదు. అతడు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. 
 

811
Pavithra Jayaram Chandrakanth

తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. మారతాడేమోనని అంతా ఎదురుచూశాం. కానీ మారలేదు. యాక్సిడెంట్‌ తర్వాత అతడి ఫ్రెండ్‌ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. పవిత్ర ఎల్‌ఐసీ డబ్బుల కోసం వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. మేమెవరం ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. ఇంతలోనే అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది' అంటూ గుండె పగిలేలా ఏడ్చింది చందు తల్లి.

911

ఇక ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. ఈ క్రమంలో పవిత్ర మరణాన్ని భరించలేక చందు కూడా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పూనుకొన్నాడ‌ు. చంద్రకాంత్ కు ఇది వరకే పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రినయని సీరియల్ స‌మ‌యంలో పవిత్ర తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్రకి కూడా పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కొన్ని లీగల్ ఇష్యుస్ ఉన్నందు వలన వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. 
 

1011
Pavithra Jayaram

చందు భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్‌లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.
 

1111
Pavithra Jayaram

పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.

click me!

Recommended Stories