జపాన్ లో భూకంపం సంభవించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ టూర్ లో ఉన్నారు. దీనితో ప్రభాస్ యోగ క్షేమాలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆందోళన తొలగించేలా డైరెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ కి పెద్ద గండం తప్పింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో జపాన్ లో బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రానికి బాగా ఆదరణ లభించిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. దీనితో బాహుబలి ది ఎపిక్ చిత్రాన్ని డిసెంబర్ 12 రిలీజ్ చేస్తున్నారు.
25
జపాన్ లో భూకంపం
ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉండగా అభిమానులకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. జపాన్ లో సోమవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం ఎక్కువగా నమోదు కాగా దాని ప్రభావం టోక్యో లాంటి నగరాలపై కూడా పడింది.
35
ప్రభాస్ ఎక్కడ ఉన్నారు ?
దీనితో ప్రభాస్ అభిమానులు కంగారు పడ్డారు. తమ హీరో ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. ప్రభాస్ అభిమానుల ఫ్యాన్ పేజీ నుంచి ఓ పోస్ట్ వైరల్ అయింది. జపాన్ లో భూకంపం, సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు. హీరో ఎక్కడ ఉన్నారు ? ఈ రోజు రిటర్న్ అవుతారా ? అంటూ పోస్ట్ వైరల్ అవుతోంది.
అభిమాని పోస్ట్ కి రాజా సాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. డార్లింగ్ ప్రభాస్ తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ప్రభాస్ లేరు. సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మారుతి క్లారిటీ ఇచ్చారు. దీనితో ప్రభాస్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
55
సంక్రాంతికి రాజాసాబ్
ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హారర్ కామెడీ చిత్రంగా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.