పేరెంట్స్ కోసం అనుపమా పరమేశ్వరన్ షాకింగ్ నిర్ణయం, ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన బ్యూటీ..?

First Published | Sep 30, 2022, 7:16 AM IST

ఈ మధ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది మలబారు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. కార్తికేయా‌-2 సినిమాతో  సూపర్ డూపర్ హిట్ కొట్టింది చిన్నది. ఇక ఇండస్ట్రీలో దూసుకుపోతుంది అనుకుంటే అందరికి షాక్ ఇవ్వబోతుందట అనుపమా. మరి ఈ బ్యూటీ తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏమిటి..? 

ఈ మధ్య  సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అడపాదడపా సినిమాలు.. అవి కూడా పెద్దగా పేరున్నవి కాదు.. స్టార్ డమ్ లేదు.. కాని సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు అదరిపోయే అప్ డేట్స్.. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోస్ తో హడావిడి చేస్తుంది బ్యూటీ.

  కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న అనుపమా..  త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేయబోతుందటూ.. సౌత్ అంతా కోడై కూసింది. ఇండస్ట్రీలో ఈ విషయం ఓ రేంజ్ లో చర్చనీయాంశం అయ్యింది. అనుపమా ఇక సెట్ అయినట్టే అనుకున్న ఫ్యాన్స్ కు ఆమె షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  
 


ఇక ఇండస్ట్రీ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇకపై అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమాలకు సైన్ చేయదట . ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను మాత్రం  ఎక్కడా బ్రేక్ లేకుండా.. నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేసి కంప్లీట్ చేయబోతుందట. ఆతరువాత సినిమాలు చేయకుండా పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వబోతుందట. ప్రస్తుతం ఈన్యూస్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అనుపమ ఈ నిర్ణయం తన తల్లిదండ్రుల కోరిక మేరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఉత్తగనే కాదు..  తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేని కారణంగా అనుపమ పరమేశ్వరణ్ త్వరగా పెళ్లి చేసుకొని వాళ్ళను సంతోషపెట్టాలని చూస్తుందట. తన వల్ల తన తల్లీ తండ్రులు బాధపడటకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తె లుస్తోంది. అందుకే అనుపమ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదంటూ తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో....టాప్ ట్రెండింగ్ లోకి దూసుకుపోతుంది. ఎంతో అందంగా ఉండే హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ ఇప్పుడిప్పుడే సెట్అవుతుంటే..ఇలాజరిగితే ఎలా అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆమె పేరుకు మలయాళ బ్యూటీనే అయినా చూడటానికి చాలా చక్కటి కట్టూ బొట్టుతో..  తెలుగు అమ్మాయిలా ఉంటుంది. 
 

ఇక ఆమెలోని మంచి నటన గుర్తించి కార్తికేయ 2 లో మంచి రోల్ ఇచ్చారు చందు మెండేటి.. అనుకున్న దానికి కంటే కూడా ఇంకా అద్భుతంగా నటించింద అనుపమా. తన  పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్మటుకుంది. దాంతో  అనుపమ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అయితే ఈ సినిమాతో తన జాతకం తిరిగి పోయిందని ఇక అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తుందని అనుకున్నారు అభిమానులు. మరి అనుపమా ఏం చేస్తుందో చూడాలి. 

Latest Videos

click me!