లక్కీ భాస్కర్ ట్విట్టర్ రివ్యూ: హిట్టా ఫట్టా? ఆడియన్స్ తేల్చేశారు! సినిమా ఎలా ఉందంటే?

First Published | Oct 31, 2024, 7:50 AM IST

దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా టాక్ తెలియజేస్తున్నారు. 
 

కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు దుల్కర్ సల్మాన్ పెట్టింది పేరు. ఈ మలయాళ హీరోకి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన నటించిన మహానటి, సీతారామం భారీ హిట్స్. ముఖ్యంగా సీతారామం దుల్కర్ కి తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందుకే ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. 

తాజాగా ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ మూవీ చేశారు. దీపావళి కానుకగా లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లక్కీ భాస్కర్ విడుదల చేసినట్లు సమాచారం. లక్కీ భాస్కర్ మూవీ ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వచ్చింది. 

లక్కీ భాస్కర్ మూవీ కథ విషయానికి వస్తే.. ఇది 90ల నాటి కథ. భాస్కర్(దుల్కర్) ఒక చిన్న బ్యాంక్ ఎంప్లొయ్. ఆయన భార్య మీనాక్షి చౌదరి. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. కుటుంబం కోసం ఎంతకైనా తెగించే భాస్కర్ కి డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే దురాశ కలుగుతుంది. ఈ క్రమంలో తన మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. స్కామ్స్ కి పాల్పడతాడు. 
 



భాస్కర్ కి డబ్బు మీదున్న వ్యామోహం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? భాస్కర్ ఎలాంటి నేరాలు చేశాడు? పట్టుబడ్డాడా? లేదా? అనేది మిగతా కథ. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం కథ రొటీన్ గా ఉన్నప్పటికీ దర్శకుడు వెంకీ అట్లూరి ఎంగేజింగ్ గా నడిపాడు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. 

సాంకేతికంగా మూవీ ఉన్నతంగా ఉంది. 90ల నాటి సెటప్, ఆర్ట్ వర్క్ బాగా కుదిరింది. ఎక్కడా ఈ కాలం నాటి కథ అనే భావన కలదు. అందుకు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దుల్కర్ సల్మాన్ క్రైమ్స్, మైండ్ గేమ్ తో కూడిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే మూవీలో మెస్మరైజ్ చేసే ట్విస్ట్స్ కి కొదవలేదు. వెంకీ అట్లూరి చాలా బ్రిలియంట్ గా కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు రాసుకున్నాడు. 

ఇక దుల్కర్ సల్మాన్ నటనకు ప్రేక్షకులు వంద మార్కులు వేస్తున్నారు. స్కామర్ గా ఆయన తన పాత్రలో జీవించాడు. దుల్కర్ నటన చాలా సహజంగా సాగుతుందని అంటున్నారు. మీనాక్షి చౌదరి సైతం తన పాత్రకు న్యాయం చేసింది. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఎక్కకకపోయినా.. బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. 

లక్కీ భాస్కర్ మూవీలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది. అలాగే ఇటీవల విడుదలైన స్కామ్ 1992 సిరీస్ షేడ్స్ కనిపిస్తాయి. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ రిలేటెడ్ సీన్స్ పలు సిరీస్ల నుండి స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. ఓటీటీ కంటెంట్ ఫాలో అయ్యే వాళ్లకు ఈ సీన్స్ కొత్తగా అనిపించవు. 


మొత్తంగా చెప్పాలంటే లక్కీ భాస్కర్ ఎంగేజింగ్ పీరియాడిక్ క్రైమ్ డ్రామా. ఒక మధ్యతరగతి వ్యక్తి తన తెలివితేటలతో డబ్బులు ఎలా సంపాదించాడు. ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనే విషయం తెలియజేస్తుంది. బ్రిలియంట్ సీన్స్, ట్విస్ట్స్, దుల్కర్ సల్మాన్ నటన ఆకట్టుకునే అంశాలు. 

మూవీలో లోపాలు ఉన్నాయి. సన్నివేశాలు రిపీట్ అయిన భావన కలుగుతుంది. అలాగే పలు సిరీస్లకు సంబంధించిన షేడ్స్ కనిపిస్తాయి. క్రైమ్ డ్రామాలు ఇష్టపడేవారు హ్యాపీగా ఒకసారి లక్కీ భాస్కర్ మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీ ఫలితం ఏమిటనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

Latest Videos

click me!