ఈ దీపావళికి తెగులు బాక్సాఫీస్ బరిలో అనేక సినిమాలు అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ (KA Movie) ఒకటి. ఈ చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు.. విసిరిన సవాళ్లు ఆ అంచనాల్ని రెట్టింపు చేశాయి.
అందుకు తగినట్లుగానే ఈ ‘క’ (KA Movie 2024)కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా మంచి వసూళ్లనే తెచ్చేలా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఎంత అయ్యింది..ఎంత బడ్జెట్ పెట్టారు వంటి విషయాలు చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘క’ (KA Movie) చిత్రం బడ్జెట్ 15 కోట్లు. ఇందులో కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ లేదు. అది కూడా కలిపితే 20 కోట్లు అవుతుంది. ఈ సినిమాకు ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి మంచి క్రేజ్ క్రియేట్ కావటంతో బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమాకు టేబుల్ ప్రాఫెట్ వచ్చినట్లే తెలుస్తోంది.
‘క’ (KA Movie) తెలుగు వెర్షన్ థియేటర్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని ఈటీవి వారు 10 కోట్లకు తీసుకున్నారు. దాంతో 22 కోట్లు బ్రేక్ ఈవెన్ మార్క్ ని చేరుకున్నట్లు అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది కాబట్టి వేరే భాషల్లోకి వెళ్తే ఆ రైట్స్ నిమిత్తం మరో కొంత ఎమౌంట్ వస్తుంది. అలాగే ఈ సినిమా రైట్స్ తీసుకున్న వాళ్లకు బాగానే లాభాలు వచ్చేలా కనపడుతోంది.
ఇక ‘‘క’ లాంటి కాన్సెప్టు ఇంత వరకూ రాలేదు.. అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తా’’ ఈ సినిమా గురించి ప్రమోషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం (ka movie kiran abbavaram) చెప్పారు. తెరపై ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు తను చెప్పిన మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుందని చూసిన వాళ్లు అంటున్నారు.
దర్శకులు ఎంచుకున్న కథ.. నాన్‌లీనియర్ స్టైల్‌లో దాన్ని నడిపిన తీరు.. ఈ కథను సెట్ చేసిన కృష్ణగిరి ఊరు.. అందులోని సమస్య.. దాన్ని పరిష్కరించే క్రమంలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు.. వేటికవే ఆకట్టుకుంటాయి.
అయితే సినిమా అంతా ఒకెత్తైతే ఇంట్రవెల్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవిల్ అని మెచ్చుకుంటున్నారు. ఈ రెండూ ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయేలా డిజైన్ చేసారు. ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి. ముఖ్యంగా మనిషి పుట్టుక.. కర్మ ఫలం.. రుణానుబంధం.. ఈ మూడు అంశాల్ని ముడిపెట్టి దర్శకుడు చెప్పిన సందేశం..
కథను ముగించిన తీరు భలే ఉందనిపిస్తుందని మెచ్చుకుంటున్నారు.చివరి 15నిమిషాలు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది. ఇక ముగింపు ఓ కొత్త అనుభూతిని అందిస్తూ.. చప్పట్లు కొట్టించేలా చేస్తుంది.