Actor Suman: చిరంజీవి, బాలకృష్ణ మధ్య విభేదాలపై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ నచ్చదా ? అనే అంశంపై సుమన్ స్పందించారు.
చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య దశాబ్దాలుగా విభేదాలు, రైవలరీ ఉందని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి ఫ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులు వెళ్లి కలిశారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం సినీ ప్రముఖుల్ని అవమానించారు అనే చర్చ జరిగింది.
25
చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు
ఇటీవల అసెంబ్లీలో దీని గురించి చర్చ జరిగింది. చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్లే జగన్ దిగొచ్చి సినీ ప్రముఖుల్ని కలిశారు అంటూ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. వెంటనే రియాక్ట్ అయిన బాలకృష్ణ.. చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదు అక్కడ. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అనేది అబద్దం అంటూ బాలయ్య ఖండించారు. చిరంజీవికి క్రెడిట్ ఇవ్వడానికి బాలయ్య అంగీకరించలేదు.
35
బాలయ్య కామెంట్స్ పై సుమన్ రియాక్షన్
చిరంజీవి కూడా తిరిగి బాలయ్యకి కౌంటర్ ఇచ్చారు. దీనితో చిరు, బాలయ్య మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. చిరంజీవిని పొగిడితే బాలయ్యకి నచ్చదు అంటూ ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నిజంగానే చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా ప్రశ్నించారు. దీనికి సుమన్ స్పందిస్తూ.. బాలకృష్ణ గారు మంచికి మంచి చెడుకి చెడు లాగా ఉండే వ్యక్తి. ఆయన కొంచెం షార్ట్ టెంపర్. ఎందుకు అలా అంటే.. ఆయన ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఎక్కడకి వెళితే ఆ బాధ్యతలకు తగ్గట్లుగా మారిపోవాలి. ఈ క్రమంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. అలాంటప్పుడు కొన్ని మాటలు నోటి నుంచి పొరపాటుగా జారుతాయి. చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. కాస్త ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోగలరు. రాజకీయంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు నోరు జారుతుంటారు. ఆ వివాదం అక్కడి వరకే పరిమితం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.
55
మేమంతా బాగానే ఉన్నాం
ఆ వివాదాలు ఎక్కువ కాలం ఉండవు. కానీ పొరపాటున వచ్చిన మాట వల్ల వాళ్ళ ఫ్యాన్స్.. వీళ్ళ ఫ్యాన్స్ గొడవపడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని వివాదాలు ఉన్నా హీరోలు హీరోలు బాగానే ఉంటారు. మేమంతా బాగానే ఉన్నాం అని సుమన్ తెలిపారు.