Drones Movie: ప్రేమలో పడిన మగవాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె, ఆత్మలను బంధించే బొమ్మల ఇల్లు, వింత శాస్త్రవేత్త ప్రయోగాలు! ఇలాంటి వైవిధ్యమైన కథాంశంతో 'డ్రోన్స్' సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
ఇటీవలి కాలంలో ఓటీటీలు విభిన్నమైన కథాంశాలున్న సినిమాలకు పెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, ఫాంటసీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక విభిన్నమైన కథతో వచ్చిన హారర్ ఫాంటసీ సినిమా డిజిటల్ వరల్డ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీలో విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న ఆ సినిమా ఏదో తెలుసా? సిద్ధి ఇద్నాని, అంజలి నాయర్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన 'డ్రోన్స్'.
25
ప్రైమ్ వీడియోలో 'డ్రోన్స్' హవా!
నవంబర్ 20న 'డ్రోన్స్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. ఓటీటీలోకి వచ్చిన కొద్దిసేపటికే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విశేషమేమిటంటే, ప్రైమ్ వీడియోలోని రొమాన్స్ సినిమాల విభాగంలో ఈ సినిమా రెండవ స్థానంలో ట్రెండ్ అవుతోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. దీంతో వివిధ భాషలకు చెందిన సినీ ప్రియులు ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు. 'బన్ బటర్ జామ్' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు ఆర్. రాఘవ్ మిర్దాత్ తెరకెక్కించిన రెండవ సినిమా ఇది.
35
ఐఎండీబీలో 7.4 రేటింగ్
అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన 'డ్రోన్స్' సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ, దీనికి ఒక్క రోజు ముందే పెద్ద సినిమా 'జైలర్ 2' విడుదల కావడంతో 'డ్రోన్స్'కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదని సమాచారం. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయిందనే టాక్ వినిపించింది. అయితే, థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం దొరికింది. ఐఎండీబీలో 7.4 రేటింగ్ సాధించడం కూడా ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.
'డ్రోన్స్' సినిమా స్పెషాలిటీ దాని విభిన్నమైన కథాంశమే. హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలను మిక్స్ చేసి దర్శకుడు ఈ కథను అల్లారు. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు విద్యార్థులు ఒక వింత స్వభావం ఉన్న శాస్త్రవేత్త ఇంట్లో ఆశ్రయం పొందడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. మూఢనమ్మకాలు, జాతకాలను నమ్మని శాస్త్రవేత్త పద్మనాభన్, మనుషుల్లా భావాలను వ్యక్తపరిచే ఒక హ్యూమనాయిడ్‌ను సృష్టించే ప్రయత్నంలో ఉంటాడు. ఈ క్రమంలో నిద్రలో నడిచే అలవాటున్న విద్యార్థి, మినియేచర్ ఆర్టిస్ట్ ప్రకృతి, ఆమెతో ఉండే మంత్రగత్తె, ఆత్మలను బంధించే బొమ్మల ఇల్లు, ప్రేమ శాపానికి గురైన పోలీస్ ఆఫీసర్ ఇలా పలు విచిత్రమైన పాత్రలు కథలో ఎదురవుతాయి.
55
ప్రేమలో పడిన మగవాళ్లే మంత్రగత్తె టార్గెట్..
ఇక ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ప్రేమలో పడే పురుషులను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె పాత్ర. ఇలాంటి వింత సంఘటనలు, ఊహించని మలుపులు, ఎమోషనల్ క్లైమాక్స్ సినిమా కథకు మరింత థ్రిల్లింగ్ ఇస్తాయి. హారర్‌తో పాటు ఫాంటసీ, కామెడీ, లవ్ స్టోరీ అంశాలు ఉన్న 'డ్రోన్స్' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథలను ఇష్టపడేవారు ఈ వీకెండ్లో చూడాల్సిన సినిమాల లిస్ట్‌లో దీన్ని కూడా చేర్చుకోవచ్చు.