రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో 'హెల్లల్లల్లో' అనే స్పెషల్ సాంగ్ పై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు డ్యాన్స్ చేయడం, ఫ్యాషన్ అంటే ఇష్టమని, అందుకే ఈ పాట చేశానని క్లారిటీ ఇచ్చింది. తనకు ఇష్టం లేని పనిని ఎప్పటికీ చేయనని తెగేసి చెప్పింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమాలో శ్రుతి హాసన్ 'హెల్లల్లల్లో' అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తాజాగా స్పెషల్ సాంగ్స్ పై వస్తున్న విమర్శలకు శ్రుతి గట్టి కౌంటర్ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి తనకు కొన్ని కారణాలు ఉన్నాయని, మహిళలను తప్పుగా చూపించడంపై వస్తున్న విమర్శలను కూడా ఆమె ప్రస్తావించింది.
25
పెద్ది ఐటెం సాంగ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి హాసన్.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అవసరం ఏంటని తాను కూడా ప్రశ్నించానని చెప్పింది. అయితే 'పెద్ది'లోని 'హెల్లల్లల్లో' పాటకు ఒప్పుకోవడానికి ఓ కారణం ఉందని తెలిపింది. తనకు డ్యాన్స్ చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టమని, ఇలాంటి పాటల్లో నటించడం ఆనందంగా ఉంటుందని చెప్పింది. ఏ విషయంలోనైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆ పని అస్సలు చేయనని, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ సీన్ లో నటించాలనేది తన ఇష్టమేనని స్పష్టం చేసింది. కొన్నిసార్లు తన నిర్ణయాల వల్ల కష్టాలు వచ్చినా పట్టించుకోనని, ఇష్టం లేని పని ఎప్పటికీ చేయనని తేల్చి చెప్పింది.
35
ఐటెం సాంగ్స్ కే పరిమితం కాలేదు
సినిమాల్లో మహిళలను ఎలా చూపిస్తున్నారనే దానిపై జరుగుతున్న చర్చల గురించి తనకు తెలుసని శ్రుతి హాసన్ చెప్పింది. అయితే తన వ్యక్తిగత అనుభవంలో ఈ స్పెషల్ సాంగ్స్ పాజిటివ్ గానే ఉన్నాయని, డ్యాన్స్ చేయడం, కొరియోగ్రఫీలో పాల్గొనడం, అందంగా కనిపించడం తనకు సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది. మహిళలను తప్పుగా చూడటం కేవలం ఐటెం సాంగ్స్ కే పరిమితం కాలేదని, సమాజంలో చాలా చోట్ల ఉందని అభిప్రాయపడింది. అందుకే ఏది ఒప్పుకోవాలి, ఏది వద్దు అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలని సూచించింది.
ఇదే ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ అనుభవం గురించి అడిగినప్పుడు.. ఆమె తరపున మాట్లాడటం సరికాదని, అది ఆమె వ్యక్తిగత విషయమని శ్రుతి చెప్పింది. మరోవైపు 'పెద్ది' సినిమాలో తన పాత్ర గురించి జాన్వీ కపూర్ గతంలో 'కాఫీ విత్ కరణ్' షోలో మాట్లాడింది. తెరపై తన అచ్చెమ్మ పాత్రను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలకు జాన్వీ స్పందించింది. ఆ పాత్ర వల్ల సమాజంపై ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడుతుందోనని బాధపడ్డానని, పాత్రను ప్రెజెంట్ చేయడంలో తప్పులు ఉన్నాయని అంగీకరించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని జాన్వీ చెప్పింది.
55
గ్లామర్ డోస్
దీనిపై గతంలో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా క్షమాపణలు చెప్పాడు. జాన్వీ పాత్రను పరిచయం చేసిన విధానం, కొన్ని సీన్స్ పై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు రావడం, గ్లామర్ డోస్ ఎక్కువైందనే విమర్శలతో ఆయన స్పందించాడు. అభ్యంతరం ఉన్న సీన్స్ ను మార్చుతామని చెప్పాడు. మొత్తానికి 'పెద్ది' స్పెషల్ సాంగ్ లో నటించిన శృతి హాసన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఇష్టం వచ్చినట్లే ఉంటానని శ్రుతి చెప్పగా, తన పాత్రపై జాన్వీ కపూర్ బాధపడటం ఆసక్తికరంగా మారింది.