Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్

Published : Feb 10, 2026, 08:42 PM IST

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్‌` మూవీ ఓటీటీకి సంబంధించిన ఆసక్తికర వార్త వినిపిస్తోంది. రికార్డు రేట్‌కి అమ్ముడు పోయిందని సమాచారం. 

PREV
15
జోర్డన్‌లో `డ్రాగన్‌` షూటింగ్‌

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్‌` అనే పేరుని అనుకుంటున్నారట. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జోర్దన్‌లో జరుగుతుంది. భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. ఇందులో మలయాళ నటుడు టొవినో థామస్‌ కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఆయన ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరి మధ్య కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారట.

25
భారీ రేట్‌కి ఓటీటీ డీల్‌?

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీ ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యిందట. రికార్డు ధరకి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏకంగా రూ.145కోట్లకు డీల్‌ కుదిరిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ మూవీ కావడంతో మార్కెట్‌ పరంగా భారీ క్రేజ్‌ ఉంది. పైగా ఇలాంటి యాక్షన్‌ చిత్రాలను ఓటీటీలో బాగా చూస్తారు. అందుకే నెట్‌ ఫ్లిక్స్ భారీ స్థాయిలో ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఇందులో నిజం ఎంతా అనేది క్లారిటీ లేదు.

35
డ్రాగన్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్లు

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ నటిస్తున్న `డ్రాగన్‌` మూవీకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఎపిసోడ్లు ఉంటాయట. సాధారణంగా ప్రశాంత్‌ నీల్ మూవీలు డార్క్ గా ఉంటాయి. బ్లాన్‌ టోన్‌ ఉంటుంది. `కేజీఎఫ్‌`, `సలార్‌` చిత్రాల్లో అది చూడొచ్చు. ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల చేసినప్పుడు కూడా అదే టోన్‌ మెయింటేన్‌ చేశారు. దీంతో ఈ మూవీ కూడా బ్లాక్‌ అండ్‌ వైట్‌ టోన్‌ ఎక్కువగా ఉంటుందని సమాచారం.

45
ఎన్టీఆర్‌ నయా లుక్‌ గూస్‌ బంమ్స్

ఎన్టీఆర్‌ లుక్‌ కూడా మారిపోయింది. ఆ మధ్య మరీ బక్కగా కనిపించారు. ఫేస్‌లో గ్లో లేదు, అనారోగ్యానికి గురైనప్పుడు ఎలా ఉంటారో అలా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలా మారిపోయారు. మోస్ట్ స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు చాలా పవర్‌ఫుల్‌గానూ కనిపిస్తున్నారు. లేటెస్ట్ ఎయిర్‌పోర్ట్ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంది. అది సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

55
బెంగాల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో `డ్రాగన్‌

ఇక `డ్రాగన్‌` చిత్రాన్ని గ్యాంగ్‌ స్టర్‌ కథతో రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. 1970 బెంగాల్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో మాఫియా లీడర్‌గా ఎన్టీఆర్‌ కనిపిస్తారని సమాచారం. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అనీల్‌ కపూర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగిటివ్‌ రోల్‌ అని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories