Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌

Published : Feb 10, 2026, 07:03 PM IST

అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. బన్నీని కలవాలంటే 42 రూల్స్ ఉన్నాయని ఒక స్ట్రాటజర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో బన్నీ టీమ్‌ స్పందించి వార్నింగ్‌ ఇచ్చింది. 

PREV
15
అట్లీ సినిమాతో బిజీగా అల్లు అర్జున్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ `పుష్ప2` మూవీతో పాన్‌ ఇండియా మార్కెట్‌ లెక్కలు మార్చేశారు. రెండు వేల కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించారు. ఈ చిత్రం దాదాపు 1800కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అట్లీ దర్శకత్వంలో ఏఏ22 చిత్రంలో నటిస్తున్నారు. దీపికా పదుకొనె మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేస్తుంది. రష్మికతోపాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఇందులో కనిపిస్తారని సమాచారం.

25
అభిమాన సంఘాలను బలోపేతం చేస్తున్న బన్నీ

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ ఇప్పుడు తన ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకునే పనిలో ఉన్నారు. స్టేట్ నుంచి విలేజ్‌, మండల స్థాయిలో అభిమాన సంఘాలను బలోపేతం చేస్తున్నారు. అభిమానులను విస్తరించుకుంటున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారం గ్రౌండ్‌ లెవల్లో ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యే ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవలే అభిమానుల సంఘానికి సంబంధించిన కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

35
అల్లు అర్జున్‌ని కలవాలంటే 42 రూల్స్

అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన్ని కలవాలంటే రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయనేది ఒక యాడ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా వెల్లడించారు. దాదాపు 42 స్టెప్పులు దాటి వెళ్లాలని, మేనేజర్‌ తర్వాత మేనేజర్‌, మేనేజర్‌ తర్వాత మేనేజర్ ఇలా మేనేజర్లే ఎక్కువగా ఉన్నారంటూ ఆమె వెల్లడించింది. అల్లు అర్జున్‌ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంది. `ఇంతియాజ్‌ లాంటి వారితో పనిచేయడం ఈజీ, ఆయన సెలబ్రిటీలా భావించరు, అందరితో కలిసిపోతారు. అదే బాబీ డియోల్‌ చాలా సింపుల్‌గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. తన పని తాను చేసుకొని వెళ్లిపోతారు. కానీ అల్లు అర్జున్‌తో మరో రకమైన అనుభవం ఫేస్‌ చేశాను. ఆయనతో యాడ్‌ షూట్‌ చేశాం, దక్షిణాది నటులను కలిసే విషయంలో ఒక పద్ధతి ఉంటుంది. అల్లు అర్జున్‌ ని కలవడానికి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానికి 42 నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటార`ని తెలిపింది కావేరి.

45
అల్లు అర్జున్‌ రూల్స్ వెల్లడించిన కావేరీ బారువా

 అంతేకాదు మరికొన్ని షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది. హీరోకి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వొద్దు, తగిన దూరం పాటించాలి. హీరో సెట్‌లో ఉండగా ఫోన్‌ వాడొద్దు ఇలా చాలా చెబుతారు. `అల్లు అర్జున్‌ సెట్‌లోకి వస్తుండగా, చివర్లో ఎక్కడో ఫోన్‌ చూసుకుంటూ కూర్చున్నా, అంతే, ఆయన బాడీ గార్డ్స్ వచ్చి నా దగ్గర ఫోన్‌ తీసుకుని ఇక్కడ ఫోన్‌ వాడొద్దు అన్నారు. కానీ అది నా పని. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదని అలా కఠినంగా ఉన్నట్టుంది` అని కావేరీ బారువా ఓ పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. రచ్చ రచ్చ అవుతుంది.

55
కావేరీకి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి అల్లు అర్జున్‌ టీమ్‌ వార్నింగ్‌

ఈ క్రమంలో తాజాగా దీనిపై అల్లు అర్జున్‌ ఆఫీస్‌ స్పందించింది. అందులో నిజం లేదని, . అవన్నీ అబద్దమని ఆయన టీమ్‌ వెల్లడించింది. అల్లు అర్జున్‌ నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేస్తున్న ఇటీవలి వీడియో పూర్తిగా అబద్ధం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ధృవీకరించని కంటెంట్‌ని షేర్‌ చేయకుండా ఉండండి` అంటూ అల్లు అర్జున్‌ టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. కావేరీ బారువా ప్రచారం చేస్తున్న దాంట్లో నిజం లేదని బన్నీ ఆఫీస్‌ పేర్కొంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories