30,000 కోట్ల ఆస్తులు, 70 హాస్పిటల్స్, రామ్ చరణ్ తాత 90 ఏళ్ల వయస్సులో కూడా ఏం చేస్తున్నారో తెలుసా?

Published : May 01, 2025, 09:07 AM IST

ఆయన రామ్ చరణ్ కు తాత. 90 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. దాదాపు 30 వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఆ పెద్దాయన 70 కి పైగా ఆస్పిటల్స్ ను నిర్మించారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? 

PREV
16
30,000 కోట్ల ఆస్తులు, 70 హాస్పిటల్స్, రామ్ చరణ్ తాత 90 ఏళ్ల వయస్సులో కూడా ఏం చేస్తున్నారో తెలుసా?

రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన గురించి మీకు తెలుసు. ఉపాసన అపోలో గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఉపాసన తాత గురించి మీకు తెలుసా? ఆయన 30 వేల కోట్లకు అధిపతి. 91 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ పనిచేయడానికి ఇష్టపడుతున్న గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కు చైర్మెన్ ప్రతాప్ సీ రెడ్డి. 

26

మనకు రామ్ చరణ్ గురించి తెలుసు, ఆయన భార్య ఉపాసన గురించి కూడా తెలుసు. కాని చరణ్ కంటే ఉపాసన ధనవంతురాలు అని తెలుసా? దానికి కారణం ఉపాసన తాత డా. ప్రతాప్ రెడ్డి. ఆయన  71 ఆసుపత్రుల స్థాపకుడు, 28,880 కోట్ల అధిపతి. 91 ఏళ్ళ వయసులో కూడా వైద్య వృత్తి చేస్తున్నారు.

36

డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి భారతదేశంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అపోలో హాస్పిటల్స్ స్థాపకుడిగా, ఆయన దార్శనిక నాయకత్వం దేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడంలో వారి నిబద్ధత వారికి విస్తృత గౌరవాన్ని సంపాదించిపెట్టింది. అపోలో హాస్పిటల్స్ స్థాపకుిగా ఆయన దూర దృష్టి ఆరోగ్య రంగాన్ని ఎంతో ముదుకు నడిపించింది.

46

వైద్య రంగంలో ఆయన సాధించిన విజయాలకు గాను ప్రతాప్ రెడ్డికి పద్మవిభూషణ్ కూడా లభించింది. ఆయనకు 90 ఏళ్లు దాటినా కూడా  పని పట్ల ఆయనకున్న ఉత్సాహం తగ్గలేదు. ఈ శక్తివంతమైన వ్యక్తి గత సంవత్సరం ఫోర్బ్స్ యొక్క అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో 94వ స్థానంలో నిలిచాడు. 

56

డాక్టర్ రెడ్డి చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. తరువాత అతను UK మరియు USA లలో గుండె నిపుణుడిగా శిక్షణ పొందాడు. అతను బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందాడు మరియు USAలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ హాస్పిటల్‌లో అనేక పరిశోధన కార్యక్రమాలకు అధిపతిగా పనిచేశాడు, భారతదేశానికి తిరిగి రాకముందు USలో చాలా సంవత్సరాలు డాక్టర్ గా పనిచేశాడు. 
 

66

డా. సీ.పి రెడ్డి అందుకున్న డాక్టర్ గౌరవాలు 
1991: పద్మభూషణ్ అవార్డు 
2010: రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు  
2018: అపోలో హాస్పిటల్స్ నుండి లయన్స్ హ్యుమానిటేరియన్ అవార్డు 
2022: IMI నుండి జీవిత సాఫల్య పురస్కారం

Read more Photos on
click me!

Recommended Stories