పాకిస్థాన్‌లో కాసుల వర్షం కురిపించిన 5 బాలీవుడ్ సినిమాలు

Published : May 01, 2025, 07:49 AM IST

`ధూమ్ 3` నుండి `సంజు` వరకు.., అనేక బాలీవుడ్ చిత్రాలు పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించాయి. కాసుల వర్షం కురిపించాయి. మరి అక్కడ భారీగా వసూళ్లని రాబట్టిన బాలీవుడ్‌ సినిమాలేంటో చూద్దాం. 

PREV
16
పాకిస్థాన్‌లో కాసుల వర్షం కురిపించిన 5 బాలీవుడ్ సినిమాలు
ధూమ్ 3

2013లో విడుదలైన బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ చిత్రం `ధూమ్ 3` పాకిస్థాన్‌లో హిట్ అయ్యింది. ఇది సుమారు రూ.12కోట్లు వసూలు చేసిందని సమాచారం.   

26
పీకే

2014లో వచ్చిన ఆమిర్ ఖాన్ సూపర్‌హిట్ చిత్రం పీకేని పాకిస్థాన్‌లో కూడా బాగా చూశారు. అక్కడ బాగా వసూళ్లు సాధించింది. ఇది సుమారు 18కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. 

36
బజరంగీ భాయ్‌జాన్

బజరంగీ భాయ్‌జాన్ చిత్రం 2015లో విడుదలైంది. దీన్ని పాకిస్థాన్‌లో కూడా బాగా ఇష్టపడ్డారు. సినిమా అక్కడ దాదాపు 23 కోట్లు వసూలు చేసింది.

46
దిల్‌వాలే

2015లో విడుదలైన దిల్‌వాలే చిత్రంలో షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పాకిస్తాన్‌లో 20 కోట్లకుపైగానే వసూలు చేసింది. 

56
సుల్తాన్

సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం 2016లో విడుదలైంది. పాకిస్థాన్ నుండి కోట్లలో వసూలు చేసింది. ఇది సుమారు 33 కోట్లు వసూలు చేసిందని సమాచారం. 

66
సంజు

2018లో విడుదలైన రణ్‌బీర్ కపూర్ హిట్ చిత్రం సంజుకి పాకిస్థాన్‌లో మంచి ఆదరణ లభించింది. ఒక నెల పాటు థియేటర్లలో ప్రదర్శించబడింది. ఇది సుమారు రూ.37కోట్లు రాబట్టిందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories