'డబుల్ ఇస్మార్ట్' తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మాములుగా లేదుగా, ఎన్ని కోట్లంటే

First Published | Aug 13, 2024, 7:42 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఎగ్జిబిటర్స్ ఈ సినిమాకు 


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేదు. ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాల్ని మిగిల్చింది. అయినా.. ‘డబుల్ ఇస్మార్ట్’ క్రేజ్ ఇప్పుడు డబుల్ గా నడుస్తోంది.  విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్  అందుకు కారణం. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ ఏ మేరకు అయ్యిందో చూద్దాం. 

Double Ismart Ram Pothinenis


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ ఏరియావారీగా  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 22 కోట్లు దాకా జరిగిందని తెలుస్తోంది. ఇది మంచి ఎమౌంటే అని అంటున్నారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ హై సక్సెస్ ..బయ్యర్లకు నమ్మకాన్ని ఇచ్చి ఉంటుందని, ఈ సీక్వెల్ సైతం భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నారు.  



కేజీఎఫ్ , లియో లలో విలన్ గా చేసిన సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోవటం కూడా ఈ రేంజి క్రేజ్ కు కారణం అయ్యిందంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఎగ్జిబిటర్స్ ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ ఇవ్వటానికి సిద్దంగా ఉన్నారు. ఆగస్ట్ 15 న ఈ యాక్షన్ సినిమా దుమ్ము రేపుతుందని భావిస్తున్నారు. 

Ali, Double iSmart


సాధారణంగా యాక్షన్ నేపధ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పటికే పూరి-రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం సాధించడం.. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తుండడంతో ‘డబుల్ ఇస్మార్ట్’పై మంచి క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో రామ్ కి జోడీగా కావ్య థాపర్ నటిస్తే.. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Ali, Double iSmart


'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.    పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ తీశాడని..ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెట్టాడని టాక్ వినిపించింది. ఆలీ,  షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.

Latest Videos

click me!