మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో గౌతమ్ లాంచ్.. డైరెక్టర్ కూడా సిద్ధం!

First Published | Aug 13, 2024, 7:11 AM IST

గౌతమ్ కృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ సీక్వెల్ తో ఆయన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 
 

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు ప్రస్థానం మొదలైంది. బాల్యంలోనే వెండితెర మీద వండర్స్ చేశాడు. 1999లో రాజకుమారుడు చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. నెగిటివ్ టాక్ తో కూడా మహేష్ బాబు చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేస్తాయి. 

కృష్ణ నటవారసత్వాని మహేష్ బాబు ముందుకు తీసుకెళ్లాడు. ఆ ఫ్యామిలీ నుండి మూడో తరం సిద్ధం అవుతుంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. అయితే ఘట్టమనేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం గౌతమ్ కోసం. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న గౌతమ్ హీరోగా మారే అవకాశం లేకపోలేదు. 
 


గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ చిత్రం చేశాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో గౌతమ్ కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం. ఫ్యాన్స్ కోసం మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ చిత్రానికి  భారీ రెస్పాన్స్ దక్కింది. గత రీ రిలీజ్ మూవీస్ రికార్డ్స్ మురారి బ్రేక్ చేసింది. 
 

Murari


మురారి మహేష్ బాబు కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మురారి రీరిలీజ్ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ క్రేజీ క్వచ్చన్ ఎదురైంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హీరోగా మురారి సీక్వెల్ చేయొచ్చు కదా? అని అడిగారు. ఈ ప్రశ్నకు కృష్ణవంశీ ఆసక్తికర సమాధానం చెప్పారు. 
 

Mahesh Babu

ఇది చెప్పాల్సింది నువ్వో నేనో కాదు. మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ నిర్ణయించాలి. వారు ఓకే అంటే నేను ఎప్పుడూ సిద్ధమే అన్నారు. కృష్ణవంశీ మాటల ప్రకారం ఆయన మురారి సీక్వెల్ గౌతమ్ తో చేయడానికి రెడీగా ఉన్నారు. మహేష్ బాబు పచ్చజెండా ఊపితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. గౌతమ్ హీరో కావడానికి ఇంకొంచెం సమయం ఉంది. ఓ క్రేజీ ప్రపోజల్ మాత్రం కృష్ణవంశీ మహేష్ ముందు పెట్టాడు.. 
 

Latest Videos

click me!