అల్లు అరవింద్‌కి నాల్గో కుమారుడు ఉన్నాడా? అల్లు అర్జున్‌ అన్నయ్యకి ఏమైంది?

Published : May 21, 2025, 08:35 AM IST

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కి ముగ్గురు కొడుకులు అని అందరికి తెలిసిందే. కానీ మరో కుమారుడు ఉన్నాడట. అల్లు అర్జున్‌కి మరో అన్నయ్య ఉన్నాడట. మరి ఆయన ఎవరు? ఆయనకు ఏమైందనేది తెలుసుకుందాం. 

PREV
15
అల్లు అరవింద్‌కి ముగ్గురు కుమారులు

టాలీవుడ్‌లో మెగా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు అల్లు అరవింద్‌. చిరంజీవి బావమరిదిగా, లెజెండరీ కమెడియన్‌ అల్లు రామలింగయ్య తనయుడిగా ఆయన పాపులర్‌ అయ్యారు. అల్లు అరవింద్‌కి ముగ్గురు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కొడుకు అల్లు వెంకటేష్‌(బాబీ), రెండో కొడుకు అల్లు అర్జున్‌, మూడో కొడుకు అల్లు శిరీష్‌. వీరిలో అల్లు బాబీ వ్యాపారాలు చూసుకుంటారు. పబ్లిక్‌లో పెద్దగా కనిపించారు.

25
అల్లు అరవింద్‌కి నలుగురు సంతానం

రెండో కొడుకు అల్లు అర్జున్‌ అందరికి తెలిసిందే. ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప2` సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్ చేశారు. ఇప్పుడు అట్లీతో మరో గ్లోబల్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇక మూడో కొడుకు అల్లు శిరీష్‌. ఆయన కూడా హీరోగా రాణిస్తున్నారు. కానీ సరైన సక్సెస్‌లు లేక స్ట్రగుల్‌ అవుతున్నారు. అయితే అల్లు అరవింద్‌కి ముగ్గురు కొడుకులే అని అందరికి తెలుసు. కానీ ఆయనకు మరో కొడుకు ఉన్నారట.

35
అల్లు వెంకటేష్‌, అల్లు అర్జున్‌ మధ్య అల్లు రాజేష్‌ జన్మించాడు

అల్లు అరవింద్‌కి నిజానికి నలుగురు సంతానం. ఆయనకు మరో కొడుకు కూడా జన్మించాడు. ఆయన పేరు అల్లు రాజేష్‌. పెద్ద కొడుకు అల్లు వెంకటేష్‌ తర్వాత అల్లు రాజేష్‌ జన్మించాడు. అంటే అల్లు అర్జున్‌కి అన్నయ్య. అయితే ఐదారేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో అల్లు రాజేష్‌ కన్నుమూశారు. 

అప్పట్లో అది మెగా ఫ్యామిలీలో పెద్ద విషాదం. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు అల్లు అరవింద్‌. బన్నీ కూడా తన అన్నయ్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. చిన్నప్పుడు జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.

45
రోడ్డు ప్రమాదంలో మరణించిన అల్లు రాజేష్‌

అయితే ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ బయటపెట్టాడు. ఆయన మూడేళ్ల క్రితం `ఊర్వశివో రాక్షసివో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బయటపెట్టాడు అల్లు శిరీష్‌. `మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేష్‌ తర్వాత రాజేష్‌ జన్మించాడు. 

వీళ్లిద్దరి తర్వాత అర్జున్‌ పుట్టాడు. ఐదారేళ్ల వయసులోనే రాజేష్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడానికంటే ముందే ఇది జరిగింది` అని తెలిపి షాకిచ్చాడు శిరీష్‌. అయితే ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం గమనార్హం.

55
అల్లు వారసత్వాన్ని గ్లోబల్‌ వైడ్‌గా తీసుకెళ్తున్న ఐకాన్‌ స్టార్‌

అల్లు అరవింద్‌ ముగ్గురి సంతానంలో అల్లువారి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అల్లు అర్జున్‌. `అల వైకుంఠపురములో` చిత్రం తర్వాత ఆయన స్టయిల్‌ పూర్తిగా మారిపోయింది. ఎంపిక చేసుకునే సినిమాల తీరు మారింది. ఇక `పుష్ప`తో ఆయన కెరీర్‌ మరో లెవల్‌కి వెళ్లింది. `పుష్ప`కి ముందు బన్నీ, `పుష్ప`కి తర్వాత అల్లు అర్జున్‌ అనేలా మార్చేసుకున్నారు.

 `పుష్ప 2`తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సైన్స్ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఇందులో బన్నీ మూడు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories