పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? సంచలన నిర్ణయం.. నగలన్నీ ఆయనకే

Published : Apr 19, 2025, 01:05 PM IST

Vijayashanti: లేడీ అమితాబ్‌, లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీ అయ్యింది. అలాగే సినిమాల్లోనూ మళ్లీ తానేంటో చూపిస్తుంది. తాజాగా `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వైజయంతిగా నటించి మెప్పించారు. వింటేజ్‌ విజయశాంతిని చూపించారు. 

PREV
15
పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? సంచలన నిర్ణయం..  నగలన్నీ ఆయనకే
vijayashanti

Vijayashanti: విజయశాంతి చాలా కాలం తర్వాత సినిమాలు చేస్తుంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆ మధ్య మహేష్‌ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` మూవీలో నటించింది. ఇందులో బలమైన పాత్రలో మెప్పించింది.

ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీలో మెరిసింది. మళ్లీ సినిమాలు కొనసాగిస్తారా? అంటే లేదనే చెప్పింది. తాను ప్రజలకు సంబంధించిన బాధ్యాయుత పదవిలో ఉన్నానని, ఇక సినిమాలు చేయడం కుదరదు అని వెల్లడించింది. 
 

25
vijayashanti

ఈ క్రమంలో విజయశాంతికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం వైరల్‌ అవుతుంది. పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులను ఏం చేయబోతుంది? ఎవరికి ఇస్తుందనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది.

అదే సమయంలో పిల్లల గురించి కూడా ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. తాను ప్రజల కోసమే పిల్లల్ని వద్దనుకున్నట్టు తెలిపారు విజయశాంతి. ఈ లైఫ్‌ని ప్రజలకు అంకితం ఇవ్వడం కోసమే పిల్లల్ని కనొద్దు అనుకున్నామని తెలిపారు. 
 

35
vijayashanti

ఈ సందర్భంగానే తన ఆస్తులకు సంబంధించిన షాకింగ్‌ విషయం వెల్లడించారు. తమ మరణ అనంతరం తన ఆస్తి మొత్తం ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు విజయశాంతి. తన తల్లి పేరున ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం తన ఆస్తిని కేటాయిస్తానని చెప్పారు.

తన వద్ద ఉన్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసినట్టు తెలిపారు. ఇలా విజయశాంతి నగలన్నీ ఆ శ్రీవారికి చెందాయన్నమాట. విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి, అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. 

45
Vijayashanti

విజయశాంతి.. అలనాటి నటి విజయ లలితకి కూతురు వరుస అవుతుంది. ఫ్యామిలీలో సినిమావాళ్లు ఉండటంతో విజయశాంతి సినిమా ఎంట్రీ ఈజీగానేజరిగింది. అంతేకాదు త్వరగానే అయ్యింది.

ఆమె 15వ ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటిగా రాణిస్తుంది. 1980లో నటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో రెండు వందలకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 
 

55
Vijayashanti

విజయశాంతి లేడీ అమితాబ్‌ గా పిలిపించుకున్నారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పించి, స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారు. స్టార్‌ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు ఆదరణ పొందడం విశేషం. అత్యధిక పారితోషికం అందుకున్న నటిగానూ నిలిచారు.

పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్స్ తో ఆమె చేసిన రచ్చ వేరే లెవల్‌. ఇప్పుడు `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`లో మరోసారి అప్పటి రోజులను గుర్తు చేయడం విశేషం. ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. 

read  more: చిరంజీవి, పవన్‌తో గొడవలు.. ఉదయ్‌ కిరణ్‌ లాగే రోజాకి సినిమా ఛాన్సులు రావా? సీనియర్‌ నటుడు సెన్సేషనల్‌ కామెంట్స్

also read: కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో స్టార్‌ అయిపోయిన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి కాదు.. ఏకంగా తనకే పోటీ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories